ఏపీలో అంబులెన్స్ కలర్ మారింది : పసుపు, తెలుపు రంగుల్లో కొత్త స్టిక్కర్లు

ఏపీలో అంబులెన్స్ కలర్ మారింది : పసుపు, తెలుపు రంగుల్లో కొత్త స్టిక్కర్లు

ఏపీలో అంబులెన్సుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి సర్కార్. వైసీపీ హయాంలో వేసిన నీలం రంగును తొలగించాలని నిర్ణయించింది ప్రభుత్వం. త్వరలోనే సాధారణ తెలుపు రంగుతో పాటు ప్రకాశవంతమైన ఎరుపు, పసుపు రంగులతో రిఫ్లెక్టీవ్ టేపులతో అంబులెన్సులు సిద్ధం చేయాలని డిసైడ్ అయ్యింది సర్కార్. వైసీపీ హయాంలో వేసిన రంగులు తొలగించి అత్యాధునిక సాంకేతిక పరికరాలు అమర్చిన కొత్త అంబులెన్సులు వీలైనంత త్వరగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది ప్రభుత్వం. 

కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామకవాడలో కుశలవ కోచ్ లో కొత్త అంబులెన్సులను సంబందించిన పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. సంజీవని పేరుతో 104 వాహనంపై ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ ఫోటోలను ముద్రించనున్నట్లు తెలుస్తోంది.

కొత్త అంబులెన్సులను సంబంధించిన ఫోటో కూడా నెట్టింట వైరల్ గా మారింది. ఈ క్రమంలో కూటమి సర్కార్ నిర్ణయంపై ప్రతిపక్ష వైసీపీ విమర్శలు సంధిస్తోంది. రంగుల విషయంలో జగన్ ను విమర్శించిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తమ అంబులెన్సులకు తమ పార్టీ రంగులు ఎలా వేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు వైసీపీ శ్రేణులు.