తిరుపతిలో హథీరాంజీ మఠం కూల్చేయబోతున్నారా.. : ఏపీ ప్రభుత్వం నిర్ణయం వెనక కారణాలు ఏంటీ..?

తిరుపతిలో హథీరాంజీ మఠం కూల్చేయబోతున్నారా.. : ఏపీ ప్రభుత్వం నిర్ణయం వెనక కారణాలు ఏంటీ..?

తిరుపతిలో హథీరాంజీ మఠాన్ని ఏపీ ప్రభుత్వం కూల్చేయాలంటూ ఏపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఏపీ ప్రభుత్వ నిర్ణయం హథీరాంజీను కులదైవంగా ఆరాధించే బంజారా, లంబాడి సమాజం మనోభావాలను దెబ్బతీసేలా ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. భక్తుల మనోభావాలను పరిగణలోకి తీసుకొని మఠం కూల్చివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు భక్తులు.

తిరుపతిలో ఉన్న హథీరాంజీ మఠం చాలా పురాతనమైందని.. ఈ భవనం శిథిలావస్థకు చేరిందని.. దీని వల్ల ప్రమాదం పొంచి ఉందని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. ఈమేరకు ఇటీవల ఐఐటీ తిరుపతి నిపుణులతో ఒక నివేదిక తయారు చేయించారు అధికారులు. సదరు నివేదికలో మఠం భవనం ప్రమాదకరంగా ఉందని.. కూల్చేసి కొత్తగా నిర్మించాలని నిపుణులు సూచించారని తెలిపారు అధికారులు.

ఐఐటీ తిరుపతి నిపుణులు ఇచ్చిన నివేదిక ఆధారంగా భక్తులు, వ్యాపారుల భద్రత దృష్ట్యా మఠం భవనాన్ని కూల్చేసి కొత్తగా నిర్మించాలని ఏపీ సర్కార్ డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలో బంజారా సంఘాలు, నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. మరి, హథీరాంజీ మఠం కూల్చివేత విషయంలో ఏపీ ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేదా చూడాలి.