ఏపీలో సినిమా టికెట్ 5 రూపాయలే

 ఏపీలో సినిమా టికెట్ 5 రూపాయలే

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆన్ లైన్ లో టికెట్ల ధ‌ర‌ల‌ను ఇవాళ(బుధవారం)  రిలీజ్ చేసింది. మున్సిప‌ల్ కార్పొరేష‌న్ , మున్సిపాలిటీ , న‌గ‌ర పంచాయితీ, గ్రామ‌పంచాయ‌తీ ఏరియాల వారీగా టికెట్ల ధ‌ర‌ల‌ను ఫిక్స్ చేసింది. అంతేకాదు ఈ టికెట్ల ధ‌ర‌ల‌ను ఫైన‌ల్ చేస్తూ జీవో కూడా జారీ చేసింది. అంతేకాదు ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని.. ప్రతిరోజు కేవలం నాలుగు షోలు మాత్రమే నిర్వహించాలంది. ప్రభుత్వం ఖరారు చేసిన ధరలకే ఇక నుంచి సినిమా టికెట్లు అమ్మ నున్నట్టు జీవోలో తెలిపింది. ఇక నుంచి టికెట్లు ఆన్ లైన్ లోనే తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. సవరించిన ధరల ప్రకారం.. అత్యంత కనిష్ట ధర రూ.5 కాగా.. అత్యంత గరిష్ట ధర రూ.250గా తెలిపింది. ఇకపై బెనిఫిట్ షోలకు అనుమతి ఉండదని తెలుస్తోంది.


మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో...

మల్టీప్లెక్సు: ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40
నాన్ ఏసీ: ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20

మున్సిపాలిటీ ప్రాంతాల్లో...

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.150, డీలక్స్ రూ.100, ఎకానమీ రూ.60
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.70, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
నాన్ ఏసీ: ప్రీమియం రూ.50, డీలక్స్ రూ.30, ఎకానమీ రూ.15

నగర పంచాయతీల్లో...

మల్టీప్లెక్స్: ప్రీమియం రూ.120, డీలక్స్ రూ.80, ఎకానమీ రూ.40
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.35, డీలక్స్ రూ.25, ఎకానమీ రూ.15
నాన్ ఏసీ: ప్రీమియం రూ.25, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10

గ్రామ పంచాయతీ ప్రాంతాల్లో...

మల్టీప్లెక్స్:  ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30
ఏసీ/ఎయిర్ కూల్: ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10
నాన్ ఏసీ: ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5