భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,708 మంది కుష్టు వ్యాధి అనుమానితులు

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,708 మంది కుష్టు వ్యాధి అనుమానితులు
  • భద్రాద్రికొత్తగూడెం డీఎంహెచ్​వో తుకారాం రాథోడ్​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  జిల్లాలో 1,708 మంది కుష్టు వ్యాధి అనుమానితులను గుర్తించినట్టు డీఎంహెచ్​వో డాక్టర్​ తుకారం రాథోడ్​ గురువారం ఒక  ప్రకటనలో తెలిపారు.గత నెల 18 నుంచి 31వరకు జిల్లా వ్యాప్తంగా ఇంటింటి సర్వే చేపట్టామని, సర్వేలో 1436 టీమ్​లు పాల్గొన్నాయని తెలిపారు. 

2,47,693 ఇండ్లను సందర్శించి 8,89,635మంది వ్యక్తులను పరిశీలించామని పేర్కొన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అనుమానితులను వైద్య పరీక్షలు చేసిన నిర్ధారించనున్నట్టు తెలిపారు. ఈ ప్రకారంగా ఇప్పటి వరకు  నలుగురిని కుష్టు వ్యాధి గ్రస్తులుగా గుర్తించామని పేర్కొన్నారు.