వైఎస్సార్ జిల్లా పేరు మార్చిన ప్రభుత్వం..కొత్త పేరు ఏంటంటే.?

వైఎస్సార్ జిల్లా పేరు మార్చిన ప్రభుత్వం..కొత్త పేరు ఏంటంటే.?

 వైఎస్సార్ జిల్లా పేరును మార్చింది ఏపీ ప్రభుత్వం.  వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . ఇటీవలే కేబినెట్ లో  తీసుకున్న నిర్ణయం మేరకు మే 26న అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. 

కడప జిల్లాను  వైఎస్సార్ కడప జిల్లాగా ఉమ్మడి ఏపీలో పేరు మార్చింది అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం. తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కడప పేరును తొలగించి వైఎస్సార్ జిల్లాగా పేరు మార్చారు. 

వైఎస్సార్ జిల్లా అని పెట్టడంపై పలు ప్రజాసంఘాలు, కొన్ని రాజకీయ పార్టీలు అభ్యంతరం తెలిపాయి. అలాగే కూటమి  అధికారంలోకి వస్తే జిల్లా పేరు మారుస్తామని ఎన్నికల ప్రచారంలో పర్యటించిన చంద్రబాబు హామీ ఇచ్చారు.  మంత్రి సత్యకుమార్ కూడా జిల్లా పేరు మార్చాలంటూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు.  కేబినెట్ లో తీసుకున్న  నిర్ణయం మేరకు  వైఎస్సార్ జిల్లాకు కడప జోడించి వైఎస్సార్  కడప జిల్లాగా పేరు మారుస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం