కువైట్‌ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

కువైట్‌ అగ్నిప్రమాదం..   మృతులకు పరిహారం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

ఇటీవల కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు ఉండగా.... ఇందులో ముగ్గురు ఏపీ వాసులు ఉన్నారు.   శ్రీకాకుళం జిల్లా సోంపేటలోని జింకిభద్ర గ్రామానికి చెందిన తామాడ లోకనాథం, తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలంలోని ఖండవల్లికి చెందిన సత్యనారాయణ, అన్నవరప్పాడుకు చెందిన మీసాల ఈశ్వరుడు ఉన్నారు.  

24 మంది కేరళవాసులు, ఏడుగురు తమిళనాడుకు చెందినవారు ఉన్నారు. అయితే మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.   రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు.  మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం.  

మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొమ్మగూడెం గ్రామానికి చెందిన కే గంగయ్యతోపాటు తెలంగాణకు చెందిన మరో ఇద్దరు కూడా ప్రమాదం జరిగిన భవనంలోనే ఉన్నారు. బిల్డింగ్ నుంచి దూకి వారి ప్రాణాలను కాపాడుకున్నారు. తెల్లవారుజామున ప్రమాదం జరగగానే వీరు తప్పించుకునే ప్రయత్నం చేశారు. మెట్లపై మాడిపోయిన స్థితిలో మృతదేహాలు కనిపించడం, దట్టమైన పొగ అలుముకోవడంతో భవనంపై నుంచి దూకేశారు. కేబుల్ వైర్ల సాయంతో రెండో అంతస్తు నుంచి దూకినట్లు గంగయ్య తెలియజేశారు.