పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చు: ఏపీ హైకోర్టు

పక్క రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకోవచ్చు: ఏపీ హైకోర్టు

ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చుకునే విషయంలో ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఇతర రాష్ట్రాల నుండి మద్యాన్ని తెచ్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఒక్కో వ్యక్తి ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం బాటిళ్లు తెచ్చుకోవచ్చని కోర్టు తెలిపింది. జీవో నెంబర్ 411 ప్రకారం.. ఇతర రాష్ట్రాల నుంచి పరిమిత సంఖ్యలో మద్యాన్ని తీసుకొచ్చుకునే వెసులుబాటు ఉంది. అయినా ఏపీ పోలీసులు అక్రమంగా మద్యం తరలిస్తున్నారని కేసులు పెట్టి వేధిస్తున్నారని కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్‌ను హైకోర్టు నేడు విచారించింది. మద్యం నియంత్రణ కోసం ఏపీ సర్కార్ లిక్కర్ రేట్లను భారీగా పెంచింది. దాంతో ఏపీ ప్రజలు ఇరుగు, పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా చేస్తున్నారు. మద్యం తీసుకెళ్తూ చెక్ పోస్టుల దగ్గర భారీగా పోలీసులకు పట్టుబడుతున్నారు. కాగా.. హైకోర్టు తాజా తీర్పుతో మద్యం ప్రియులకు కాస్త ఊరట లభించింది.

For More News..

తనువులు వేరైనా లక్ష్యం ఒక్కటే.. పవన్‌కు చిరూ విషెస్..

ఏడేళ్ల తర్వాత యూఎస్ ఓపెన్‌లో తొలి భారతీయుడు

నా ప్రతి అడుగులో నాన్న తోడుంది: వైఎస్ జగన్