చంద్రబాబు బెయిల్ కండీషన్స్ : జనంలో తిరగకూడదు.. ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి

చంద్రబాబు బెయిల్ కండీషన్స్ : జనంలో తిరగకూడదు.. ఆస్పత్రికి మాత్రమే వెళ్లాలి


చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏపీ హైకోర్టు.. అనారోగ్య కారణాలతో ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. సుదీర్ఘ వాదనల తర్వాత.. అనారోగ్యం దృష్ట్యా.. కంటికి ఆపరేషన్ చేయాల్సి ఉండటంతో.. ఈ బెయిల్ మంజూరు చేస్తున్నట్లు వెల్లడించిన హైకోర్టు.. అందుకు కండీషన్స్ పెట్టింది. అక్టోబర్ 31వ తేదీన.. హైకోర్టులో సుదీర్ఘవాదనల తర్వాత ఈ తీర్పు వెల్లడించింది హైకోర్టు.

చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా.. జనంలో తిరగటానికి వీల్లేదని.. రాజకీయ సభలు, సమావేశాల్లో పాల్గొనకూడదని స్పష్టం చేసింది కోర్టు. కేవలం ఆస్పత్రి మినహా మరే ఇతర కార్యక్రమాల్లో పాల్గొనరాదని.. అలా చేసినట్లయితే వెంటనే బెయిల్ రద్దు అవుతుందని ఆదేశాలు ఇచ్చింది. మీడియా, రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని కూడా ఆదేశించింది హైకోర్టు. మీడియాతో మాట్లాడకూడదని.. ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనరాదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది కోర్టు. 

సాక్షులను బెదిరించటం.. కేసును ప్రభావితం చేసే విధంగా వ్యవహరించటం వంటివి చేస్తే.. వెంటనే బెయిల్ రద్దు అవుతుందని కూడా కండీషన్ పెట్టింది కోర్టు. సో.. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చినా.. పొలిటికల్ యాక్టివిటీస్ అనేవి చేయరాదు.. కేవలం ఆస్పత్రిలో చికిత్స చేయించుకోవటం.. కంటికి ఆపరేషన్ చేయించుకోవటం మాత్రమే చేయాలి. 

నవంబర్ 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు కోర్టులో హాజరుకావాలని మధ్యంతర బెయిల్ లో స్పష్టం చేసింది హైకోర్టు.