ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమమూర్తులు

ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త న్యాయమమూర్తులు

ఏపీ హైకోర్టుకు కొత్త జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది.సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసింది.  జస్టిస్ హరినాథ్, జస్టిస్ ఎం. కిరణ్మయి, జస్టిస్ జె.సుమతి, జస్టిస్ ఎన్.విజయ్ లను హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫారసు చేసింది. త్వరలోనే ఈ నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నట్లు సుప్రీంకోర్టు కొలీజియం తెలిపింది. 

ALSO READ: చంద్రబాబుకు రిలీఫ్.. ఆ కేసులో ముందస్తు తాత్కాలిక బెయిల్ 
 

సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసిన ఈ నలుగురు జడ్జిలు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించినట్లు కొలీజియం స్పష్టం చేసింది. అయితే ఈ న్యాయవాదులను జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఈ ప్రతిపాదనలకు ఏపీ సీఎం జగన్, గవర్నర్ కూడా ఆమోదం తెలిపారు. అనంతరం సుప్రీంకోర్టు సైతం వారి నియామకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇకపోతే ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తుల బదిలీపై ఇతర రాష్ట్రాలకు  బదిలీ అయ్యారు.