గ్రూప్1 ఇంటర్వ్యూలు ఆపండి: ఏపీ హైకోర్టు

గ్రూప్1 ఇంటర్వ్యూలు ఆపండి: ఏపీ హైకోర్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తున్న గ్రూప్ 1 పరీక్షల ఇంటర్వ్యూలను నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇంటర్వ్యూల నిర్వహణను నాలుగు వారాలు ఆపాల్సిందిగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రేపటి నుంచి ఇంటర్వ్యూల ప్రక్రియ మొదలుకానున్న నేపధ్యంలో ఇవాళ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. అభ్యర్థుల మెయిన్ పేపర్ కరెక్షన్ ప్రైవేటు ఏజెన్సీతో చేయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు విచారించింది. ప్రభుత్వానికి సంబంధించిన పనిని ప్రైవేటు సంస్థ తో చేయించడం సరికాదని, ఏపీపీఎస్సీకి ఈ అధికారం లేదని పిటిషన్లు ఆరోపించారు. వీరి వాదనలు విన్న హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ఆదేశించింది.