ఎవరూ టచ్‌ చేయలేని పథకాలు తీసుకొచ్చాం: సీఎం జగన్

ఎవరూ టచ్‌ చేయలేని పథకాలు తీసుకొచ్చాం: సీఎం జగన్

2014 ఎన్నికల్లో అబద్ధాలు చెప్పి ప్రజలను నమ్మించడం ఇష్టంలేకనే ప్రతిపక్షంలో కూర్చున్నామన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.  అప్పుడు మన పార్టీ అధికారంలోకి రాలేకపోయినా.. ప్రజల్లో విశ్వసనీయతకు ఒక బ్రాండ్ అనేలా నిలబడ్డానని ఆయన చెప్పారు. ఫిబ్రవరి 7వ తేదీ బుధవారం ఏపీ అసెంబ్లీలో 2024-25 ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..  ప్రజల్లో క్రెడిబిలిటీని సంపాదించుకోవడం చాలా కష్టం... దాన్ని సాధించడం కొందరికి జీవితకాలంలో సాధ్యం కాదు.. దేవుడి దయవల్ల ఆ గుర్తింపు వైయస్ఆర్‌సీపీ సంపాదించుకుందని అన్నారు.  వైయస్ఆర్‌సీపీ పార్టీ చెప్పేదే చేస్తుంది.. చేసేదే చెబుతుంది.మా ప్రభుత్వం పాలనలో ఎవరూ టచ్‌ చేయలేని పథకాలు తీసుకొచ్చామన్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని పథకాలు రద్దు చేయలేదని చెప్పారు. అలాంటి 8 పథకాలకు మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు పెడుతున్నట్లు సీఎం జగన్ తెలిపారు.