విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం..ఏపీకి చెందిన నిందితుడు అరెస్ట్

విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం..ఏపీకి చెందిన నిందితుడు అరెస్ట్

జగిత్యాల టౌన్, వెలుగు: ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు దండుకుంటున్న ఓ వ్యక్తిని జగిత్యాల రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ శనివారం కేసు వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన డానియల్ కెవిన్ ఎడ్విన్  ఆన్​లైన్​లో ఉద్యగ ప్రకటనలు వేసి పలువురిని బురిడీ కొట్టించాడు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఏపీ, కేరళ, కర్నాటక, జమ్మూ కశ్మీర్​కు చెందిన ఐదుగురి వద్ద డబ్బులు వసూలు చేశాడు.

ఇదే తరహాలో జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం పెంబట్లకు చెందిన నవీన్ ను నమ్మించి రూ.8.40 లక్షలు వసూలు చేశాడు. కేసు నమోదు చేసుకున్న జగిత్యాల పోలీసులు నిందితుడిని అరెస్ట్​ చేశారు. క్రెడిట్, డెబిట్ కార్డులు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.