చంద్రబాబు ఏమన్నా పెద్ద మగాడా: మంత్రి అంబటి

 చంద్రబాబు ఏమన్నా పెద్ద  మగాడా: మంత్రి అంబటి

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు చేశారు.  చంద్రబాబు ఏమన్నా పెద్ద మగాడా అరెస్ట్ చేయకుండా ఉండడానికి అని విమర్శలు గుప్పించారు.  దొంగ తనం చేశానని తెలిసే చంద్రబాబు భయపడుతున్నాడని మంత్రి ఆరోపించారు. నోటీసులు ఇచ్చిన అధికారులను చంద్రబాబు ఎదురు ప్రశ్నిస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు ముడుపులు తీసుకున్న మాట నిజం అని అధికారులు నిర్ధారించుకున్న తర్వాత అధికారులు నోటీసులు ఇచ్చి ఉంటారని అంబటి పేర్కొన్నారు.

చంద్రబాబుకి ఐటీ నోటీసులు ఇచ్చారు.. అవంటే ఎందుకు అంత భయమని అన్నారు... మరోవైపు చంద్రబాబును అరెస్ట్ చేస్తారని ఆయనే చెప్పుకుంటున్నారని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. తప్పు చేస్తే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు.. తప్పు చేసిన వారు దుబాయ్ వెళ్లినా, అమెరికా వెళ్లినా అరెస్ట్ తప్పదన్నారు. పోలీసుల మీద రాళ్లు వేసి దాడులు చేస్తుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని మంత్రి తెలిపారు.