రాజమండ్రి జైలుకు ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు

రాజమండ్రి జైలుకు ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబు

ఏపీ ఎమ్మెల్సీ అనంత బాబును రాజమండ్రి జైలుకు తరలించారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అనంతబాబుకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించటంతో అతన్ని రాజమండ్రి జైలుకు పంపించారు. వచ్చే నెల 6 వరకు అనంతబాబుకు రిమాండ్ లో ఉండనున్నాడు. డ్రైవర్  సుబ్రహ్మణ్యం హత్య తర్వాత.. నాటకీయ పరిణామాల మధ్య.. ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఆర్ కార్యాలయం నుంచి భారీ బందోబస్తు మధ్య కాకినాడ జీజీహెచ్ కు తరలించారు. అక్కడ అనంతబాబుకు వైద్య పరీక్షలు చేశారు. తర్వాత మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. దీంతో అనంతబాబుకు 14రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి. అనంతబాబే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ రవీంద్రనాథ్ చెప్పారు.