పవర్​ ప్లాంట్లు ఇవ్వని ఏపీ

పవర్​ ప్లాంట్లు ఇవ్వని ఏపీ

కేంద్ర జల శక్తి శాఖ కృష్ణా, గోదావరి రివర్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ బోర్డుల పరిధిని ఖరారు చేస్తూ జులై 15న గెజిట్‌‌‌‌‌‌‌‌ నోటిఫికేషన్‌‌‌‌‌‌‌‌ జారీ చేసింది. ఆ గెజిట్‌‌‌‌‌‌‌‌ గురువారం నుంచి అమలు కావాల్సి ఉంది. కృష్ణా నదిపై తెలంగాణ, ఏపీకి కామన్‌‌‌‌‌‌‌‌ ప్రాజెక్టులుగా ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌లోని డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు, గోదావరిపై పెద్దవాగు ప్రాజెక్టులోని డైరెక్ట్‌‌‌‌‌‌‌‌ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు ఆయా బోర్డుల నిర్వహణలోకి వెళ్లాల్సి ఉంది. ఆయా ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లను బోర్డు నిర్వహణకు అప్పగిస్తూ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. కానీ తెలంగాణ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లు బోర్డుకు ఇవ్వడానికి ప్రభుత్వం తీరిగ్గా బుధవారం ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీ వేసింది. కమిటీ నివేదిక ఆధారంగానే ఏ ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లను బోర్డులకు ఇవ్వాలో నిర్ణయం తీసుకోనుంది. ఇక ఏపీ ప్రభుత్వం గురువారం సాయంత్రం జీవో నం.54 జారీ చేసింది. శ్రీశైలంపై పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌, శ్రీశైలం రైట్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌, హెచ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, ముచ్చుమర్రి పంపుహౌస్‌‌‌‌‌‌‌‌లు, శ్రీశైలం స్పిల్‌‌‌‌‌‌‌‌ వే రివర్‌‌‌‌‌‌‌‌ స్లూయిజ్‌‌‌‌‌‌‌‌లను బోర్డుకు అప్పగిస్తున్నట్టుగా ఉత్తర్వుల్లో పేర్కొంది.
బోర్డు పరిధిలోకి 226 మంది..
శ్రీశైలం డ్యాం మెయింటెనెన్స్‌‌‌‌‌‌‌‌ సర్కిల్‌‌‌‌‌‌‌‌, డివిజన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులు, నాలుగు సబ్‌‌‌‌‌‌‌‌ డివిజన్లు, 20 సెక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులు, పోతిరెడ్డిపాడు హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని తెలుగు గంగ డిస్ట్రిబ్యూటరీ సబ్‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌ -1, పోతిరెడ్డిపాడులోని రెండు సెక్షన్లు, నంద్యాలలోని రెండు సెక్షన్లు, హెచ్‌‌‌‌‌‌‌‌ఎన్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పరిధిలోని గడివేముల సబ్‌‌‌‌‌‌‌‌ డివిజన్‌‌‌‌‌‌‌‌, మల్యాల సెక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌, ముచ్చుమర్రిలోని రెండు సెక్షన్‌‌‌‌‌‌‌‌ ఆఫీసులను బోర్డుకు అప్పగించారు. బోర్డు అధీనంలోకి ఒక ఎస్‌‌‌‌‌‌‌‌ఈ, ముగ్గురు ఈఈలు, 8 మంది డీఈఈలు, 33 మంది ఏఈఈలు, ముగ్గురు టెక్నికల్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు సహా 226 మంది సిబ్బందిని అప్పగించారు.
కొనసాగుతున్న హైడ్రామా
గెజిట్‌‌‌‌‌‌‌‌ అమలుపై హైడ్రామా కొనసాగుతోంది. ఏపీ ప్రభుత్వం శ్రీశైలంలోని కంపోనెంట్‌‌‌‌‌‌‌‌లను అప్పగిస్తూ జీవో ఇచ్చినా.. వాటిని మాత్రమే తమ అధీనంలోకి తీసుకునే అవకాశం లేదని బోర్డు అధికారులు చెప్తున్నారు. తమతో పాటే తెలంగాణ ప్రాజెక్టులనూ అధీనంలోకి తీసుకోవాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. కానీ తెలంగాణ ఇప్పటికిప్పుడు తన ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లను బోర్డులకు ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఈఎన్సీ నేతృత్వంలోని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీ ప్రాజెక్టుల అప్పగింతపై స్టడీ చేసి ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది. శ్రీశైలం లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ మెయిన్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌, లాల్‌‌‌‌‌‌‌‌ బహదూర్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఇవి మినహా శ్రీశైలంపై గల కల్వకుర్తి లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం, నాగార్జునసాగర్‌‌‌‌‌‌‌‌ స్పిల్‌‌‌‌‌‌‌‌ వే రివర్‌‌‌‌‌‌‌‌ స్లూయిజ్‌‌‌‌‌‌‌‌లు, రైట్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌, లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌ హెడ్‌‌‌‌‌‌‌‌ రెగ్యులేటర్లు, ఫ్లడ్‌‌‌‌‌‌‌‌ ఫ్లో కెనాల్‌‌‌‌‌‌‌‌, ఏఎమ్మార్పీ లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ స్కీం అప్పగించడానికే సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. గోదావరిపై పెద్దవాగులోని మూడు కంపోనెంట్‌‌‌‌‌‌‌‌లు తెలంగాణ పరిధిలోనే ఉన్నాయి. వాటిని జీఆర్‌‌‌‌‌‌‌‌ఎంబీకి అప్పగించడంపైనా క్లారిటీ రాలేదు. ఈ మొత్తం ఔట్‌‌‌‌‌‌‌‌లెట్ల అప్పగింతపై ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్‌‌‌‌‌‌‌‌ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం ఉంటుందని అధికారులు చెప్తున్నారు. గురువారం నుంచే గెజిట్‌‌‌‌‌‌‌‌ అమలు కావాల్సి ఉన్నా.. రెండు బోర్డులు ప్రాజెక్టుల ఔట్‌‌‌‌‌‌‌‌లెట్లను తమ అధీనంలోకి తీసుకోవడానికి మరికొంత కాలం పట్టే అవకాశాలున్నాయి. దీనిపై బోర్డుల అధికారులను సంప్రదించగా.. రెండు రాష్ట్రాల స్పందనను సోమవారం కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. కేంద్రం నుంచి వచ్చే ఆదేశాల ఆధారంగా తదుపరి చర్యలు చేపడుతామన్నారు.
జూరాలను ముందు స్వాధీనం చేసుకోవాలట..
తెలంగాణ భూభాగంలోని కృష్ణా ప్రాజెక్టులన్నింటినీ బోర్డు అధీనంలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్‌‌‌‌‌‌‌‌ చేస్తోంది. గురువారం జారీ చేసిన జీవోతో పాటే ఈ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను బోర్డు ముందు పెట్టింది. శ్రీశైలానికి ఎగువన ఉన్న జూరాలను మొదట స్వాధీనం చేసుకోవాలని కోరింది. పూర్తయిన ప్రాజెక్టులే కాదు నిర్మాణ దశలో ఉన్న వాటిని కూడా తీసుకోవాలని పేర్కొంది. కామన్‌‌‌‌‌‌‌‌ రిజర్వాయర్ల నుంచే ఆయా ప్రాజెక్టులు నీటిని తీసుకోవాల్సి ఉంది కాబట్టి అవి పూర్తి కాగానే బోర్డు పరిధిలోకి తీసుకోవాలని సూచించింది. తమ ప్రాజెక్టులతో పాటే తెలంగాణ ప్రాజెక్టులను, పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లను  బోర్డు అధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది.