సినిమా కలెక్షన్స్ సరే.. రివ్యూలకు మీరెంత తీసుకుంటారో చెప్పనా.. లెక్కలు బయటపెట్టిన K-Ramp నిర్మాత !

సినిమా కలెక్షన్స్ సరే.. రివ్యూలకు మీరెంత తీసుకుంటారో చెప్పనా.. లెక్కలు బయటపెట్టిన K-Ramp నిర్మాత !

ఒక వెబ్ సైట్కు, KRamp నిర్మాత రాజేష్ దండకు ప్రస్తుతం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేలా పరిస్థితి ఉంది. ఈ అంశం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. కోట్లు ఖర్చు పెట్టి నిర్మాతగా ఒక సినిమా తీశానని, సదరు వెబ్ సైట్ సినిమాను సమీక్షించి.. దానికో రేటింగ్ ఇచ్చిందని రాజేష్ దండ తన ‘ఎక్స్’ ఖాతాలో రాసుకొచ్చారు. అంతవరకూ తనకు ఎలాంటి అభ్యంతరం లేదని.. కానీ ఆ వెబ్సైట్ ఇచ్చిన రివ్యూతో సంబంధం లేకుండా సినిమాను జనం ఆదరిస్తున్నారని.. దీంతో వాళ్ల క్రెడిబులిటీ పోతుందని తమ సినిమా మీద నెగిటివ్ పోస్టులు, నెగిటివ్ వార్తలు రాయడం మొదలుపెట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ సినిమా కలెక్షన్ల విషయం కాసేపు పక్కనపెట్టి.. ఆ వెబ్ సైట్ తమ వెబ్ సైట్లో సినిమా ప్రకటనలకు, రివ్యూలు ఇచ్చినందుకు ఎంత తీసుకుంటుందో చూద్దామని.. రాజేష్ దండ ఇచ్చిన టారిఫ్ లిస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది.

రాజేష్ దండ పెట్టిన లిస్ట్ ప్రకారం.. వెబ్ సైట్ ల్యాండింగ్ పేజ్లో ఒక సినిమా యాడ్ డిస్ ప్లే కావాలంటే 60 వేలు, ఆ సినిమా ప్రమోషన్ ఆర్టికల్ రాస్తే 20 వేలు, ప్రీమియర్స్కు వెళ్లి స్పెషల్ రివ్యూ రాస్తే లక్ష రూపాయలు, సినిమా రివ్యూ ఇది అని ‘ఎక్స్’లో ఒక ట్వీట్ వేస్తే 25 వేలు, ఫస్ట్ హాఫ్ రివ్యూకు 20 వేలు, సెకండ్ ఆఫ్ రివ్యూ లేట్గా ఇస్తే 30 వేలు.. ఇవన్నీ కాకుండా ఆ వెబ్ సైట్కు సినిమా నిర్మాత లక్ష రూపాయల కవర్ పంపించాల్సిన పరిస్థితి ఉందని కె-ర్యాంప్ నిర్మాత లెక్కలన్నీ బయటపెట్టాడు.

ఒక సినిమా వల్ల వెబ్ సైట్లు, ‘ఎక్స్’ పేజ్లు ఎంత లాభపడతాయో రాజేష్ దండ చేసిన ఈ ఒక్క ట్వీట్తో మొత్తం బయటపడిందని నెటిజన్లు తెగ డిస్కస్ చేసుకుంటున్నారు. ఈ ఒక్క వెబ్ సైట్ మాత్రమే కాదని సినిమా వార్తలనే నమ్ముకుని నడుస్తున్న పలు వెబ్ సైట్లు ఇంతకంటే ఎక్కువ టారిఫ్లు వసూలు చేస్తున్నాయని నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ టోటల్ ఎపిసోడ్లో కె-ర్యాంప్ నిర్మాత భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఆయన మాట్లాడిన సబ్జెక్ట్ను నెటిజన్లు సమర్థిస్తుండటం విశేషం. రాజేష్ దండ బయటపెట్టిన లెక్కలతో.. ఒక సినిమా విడుదల సమయంలో.. సినిమా టాక్పై, రివ్యూలపై ఇంత బిజినెస్ నడుస్తుందా అని కొందరు నెటిజన్లు విస్మయం వ్యక్తం చేశారు.

అసలు ఆ వెబ్ సైట్కు, K-Ramp నిర్మాతకు వివాదం ఎక్కడ మొదలైందంటే..
సినిమాలు విడుదల అయిన తర్వాత సినిమా వెబ్ సైట్లు కలెక్షన్ల లెక్కలను పబ్లిష్ చేస్తుంటాయి. ఫస్ట్ డే ఇంత, సెకండ్ డే ఇంత.. వారం కలెక్షన్లు.. పది రోజుల కలెక్షన్లు.. ఇలా కలెక్షన్లను ఇస్తుండటం ఎప్పుడూ జరిగేదే. కానీ.. బుక్ మై షో డేటా అందుబాటులోకి వచ్చాక గంటకు ఇన్ని టికెట్లు, 24 గంటల్లో ఇన్ని టికెట్లు అమ్ముడుపోయాయని BookMyShow అధికారికంగా డేటా బయటపెడుతున్న సంగతి తెలిసిందే. కె-ర్యాంప్ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదని.. శని, ఆది, సోమ.. ఈ మూడు రోజులు కలిపినా నైజాంలో కోటీ 19 లక్షల షేర్ వచ్చిందని.. కె-ర్యాంప్ బాక్సాఫీస్ లెక్కలను పైకి లేపుతున్నారని.. బాక్సాఫీస్ లెక్కలను పబ్లిష్ చేసే ‘ఎక్స్’ పేజ్లు, వెబ్ సైట్లు కావాలనే సినిమా కలెక్షన్లను ఎక్కువ చేసి చూపిస్తున్నాయని.. అంతా బోగస్ అని కె-ర్యాంప్ సినిమాపై సదరు వెబ్ సైట్ తమ ‘ఎక్స్’ పేజ్లో ట్వీట్ చేసింది.

డ్యూడ్ సినిమాకు బుక్ మై షోలో సోమవారం 196K టికెట్లు అమ్ముడుపోయాయని, కె-ర్యాంప్ సినిమాకు 47K టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయని రాసుకొచ్చింది. ఈ ట్వీట్ K-Ramp నిర్మాత దృష్టికొచ్చింది. డ్యూడ్ సినిమా టికెట్లు తెలుగు, తమిళ భాషల్లో కలిపి అమ్ముడుపోయిన డేటా అని, K-Ramp సినిమా తెలుగులో మాత్రమే విడుదలై అన్ని టికెట్లను సేల్ చేసిందని.. ముందు ఆ తేడా తెలుసుకోవాలని ఆ వెబ్ సైట్కు K-Ramp నిర్మాత హిత బోధ చేశాడు.

నిర్మాత రాజేశ్ దండ (అక్టోబర్ 21న) మూవీ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ మాట్లాడుతూ.. ‘‘మొదట మా సినిమాకు మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ మా నమ్మకాన్ని నిలబెడుతూ సూపర్ సక్సెస్ అందుకుంది. ముందు నుంచీ మాది ఫ్యామిలీ మూవీ అని చెబుతూ వచ్చాం. మేము చెప్పినట్లే అందరూ  సినిమాను ఇష్టపడుతున్నారు’ అని చెప్పారు. ‘‘K-ర్యాంప్' బ్లాక్ బస్టర్ హిట్టయింది. అయినా సరే ఒక వెబ్ సైట్ ఇంకా మా మీద ఏడుస్తూనే ఉంది.

అమెరికాలో ఉన్న వాడికి చెప్తున్నా.. పగలగొడతా.. నీకేం తెలుసురా లుచ్చా నా కొ*కా.. 'డ్యూడ్' సినిమాకి 190K, నా సినిమాకి 46K అని ఏవేవో కలెక్షన్స్ వేస్తున్నావ్. అది తెలుగు, తమిళం కలిపిరా కుక్కా.. సినిమాని తొక్కుతావా. నువ్వు మగాడివైతే తొక్కురా.. ఒక మొగోడిగా చెప్తున్నా. ఒక్క హిట్టు సినిమాని తొక్కేయాలని వీడు ఇంకా ఇలాంటి ఆర్టికల్స్ వేస్తున్నాడు. ఈ నా కొ*కుని ఏం చేయాలి.. నడిరోడ్డు మీద వీడ్ని ఉరి తీయాలి. మా మీద బతికే నా కొ*కా’’ అంటూ నిర్మాత రాజేష్ దండా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.