పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. సతీష్ రెడ్డి హౌస్ అరెస్ట్..

పులివెందులలో హైటెన్షన్.. ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్.. సతీష్ రెడ్డి హౌస్ అరెస్ట్..

ఏపీలో పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరింది. అసెంబ్లీ ఎన్నికలను తలపించే స్థాయిలో గత కొద్దిరోజులుగా పులివెందుల కేంద్రంగా ఏపీ రాజకీయాలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. మంగళవారం ( ఆగస్టు 12 ) జడ్పీటీసీ ఉపఎన్నిక సందర్భంగా పులివెందులలో ఉద్రిక్తత నెలకొంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడంతో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. పోలీసులు అదుపులోకి తీసుకున్న సమయంలో బైఠాయించి నిరసనకు దిగారు అవినాష్ రెడ్డి.

పోలీసుల తీరుపై ఫైర్ అయ్యారు అవినాష్ రెడ్డి. ఆయన ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. ఇలాంటి దారుణ పరిస్థితి ఎన్నడూ చూడలేదని.. దాడులను ఆపాల్సిన పోలీసులే తనను అడ్డుకోవడం దారుణమని అన్నారు అవినాష్ రెడ్డి. అవినాష్ రెడ్డి హౌస్ అరెస్టును కార్యకర్తలు, వైసీపీ నేతలు అడ్డుకున్నారు. మరోపక్క వేంపల్లిలో వైసీపీ కీలక నేత సతీష్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

ఇవాళ ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ జరగనుంది. పులివెందుల జడ్పీటీసీ స్థానంలో మొత్తం 10 వేల 600 ఓట్లు ఉండగా.. 11 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక ఒంటిమిట్టలో మొత్తం 13 పంచాయితీలకు గాను 24 వేల 600 ఓట్లు ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు పోలీసులు.