వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్కు ఏపీ పోలీసుల నోటీసులు

వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్కు ఏపీ పోలీసుల నోటీసులు

నెల్లూరు: కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన కేసులో వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు పంపారు. అనిల్ ఇంటికి నోటీసులు ఇచ్చేందుకు కోవూరు ఎస్సై రంగనాధ్ గౌడ్ వెళ్ళిన సమయంలో అనిల్ కుమార్ యాదవ్ అందుబాటులో లేరు. దీంతో ఆయన నివాసానికి నోటీసులు అంటించారు. జులై 26వ తేదీన ఉదయం 10 గంటలకు కోవూరు పోలీసు స్టేషన్కు రావాలని నోటీసులో పోలీసులు స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లాకు చెందిన మరో వైసీపీ నేత కాకాణి ఇప్పటికే అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా, నిబంధనలకు విరుద్ధంగా పేలుడు పదార్థాల వినియోగం, అట్రాసిటీ కేసులో కాకాణి ప్రధాన నిందితుడిగా ఉన్నారు. పొదలకూరు పోలీస్ స్టేషన్‌లో 2025 ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదు అయింది.

►ALSO READ | కృష్ణా జలాలపై ఏపీ ఇష్టారాజ్యం..కేఆర్ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి  విచారణకు రావాలని పోలీసులు అనేక సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే.. తనపై నమోదైన కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది. రెండు నెలల పాటు పోలీసులు ఆయన కోసం గాలించారు. కాకాణి బెంగళూరులో ఉన్నారని గుర్తించిన నెల్లూరు పోలీసులు అక్కడకు వెళ్లి అరెస్ట్ చేశారు.