
- నిన్న శ్రీశైలం నుంచి వరద జలాల తోడుకొని..
- ఇవాళ సాగర్ కుడి కాల్వకు నీటిని రిలీజ్ చేసుకొని
- అక్రమంగా నీటిని తరలించుకుపోతున్న ఆంధ్రప్రదేశ్
- కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన తెలంగాణ
హాలియా/హైదరాబాద్: శ్రీశైలం జలాశయం నిండక ముందే వచ్చిన వరదను వచ్చినట్టే నీటిని తరలించుకుపోతున్న ఏపీ దృష్టి ఇప్పుడు నాగార్జున సాగర్ పై పెట్టింది. కేఆర్ఎంబీ అనుమతి లేకుండా తాగు అవసరాల పేరుతో సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసుకున్నారు. దీనిపై తెలంగాణ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది.
2023 నవంబర్ 30న ఎన్నికల కౌంటింగ్ సమయంలో ఏపి అధికారులు పోలీస్ బలగాలతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు పై దౌర్జన్యంగా ప్రవేశించి ఏపీ వైపు నుంచి 13 గేట్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వాణ పై తెలుగు రాష్ట్రాల మధ్య వివాద రగిలింది. సాగర్ ప్రాజెక్టు సమస్యను పరిష్కరించేందుకు కేఆర్ఎంబి కృష్ణా రివర్ యాజమాన్యం బోర్డు రంగంలోకి దిగింది.
నీటి వాటాల వాడకంపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని సద్దుమణిగేలా నీటి ఇరు రాష్ట్రాలకు నీటి వాటాలు కేటాయింపు నిర్వహించారు. దీంతోపాటు ప్రాజెక్టు నిర్వహణ విషయంలో సైతం ప్రాజెక్టు 26 గేట్లలో తెలంగాణ వైపున్న13 గేట్లను తెలంగాణ అధికారులు ఏపీ వైపు ఉన్న 13 గేట్ల నిర్వహణ ఆయా రాష్ట్రాల అధికారులే మైంటైన్ చేసేలా కేఆర్ ఎంబీ ఆదేశాలను జారీ చేసింది.
అప్పటినుంచి భద్రత విషయంలో కేంద్ర సీఆర్పిఎఫ్ బలగాలు నాగార్జున సాగర్ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సుమారు 18 నెలల పాటు ఇటు తెలంగాణ అటు ఏపీ వైపు భద్రత బలగాలు డ్యాం పై విధులు నిర్వహించారు. సాగర్ ప్రాజెక్టు పై నెలకొన్న ప్రాజెక్టు నిర్వహణ, భద్రత, నీటి వాటాల పంపకం, మరమ్మతుల వంటి విషయంలో కేఆర్ ఎంబీ తీసుకుని నిర్ణయాలకు ఆదేశాలకు ఇరు రాష్ట్రాలు కట్టుబడి పని చేస్తున్నాయి.
కానీ తాజాగానిన్న ఏపీ అధికారులు కేఆర్ ఎంబీ నిబంధనలను ఉల్లంఘించి నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి కుడికాలువకు అక్రమంగా నీటిని వదిలారు. దీంతో మరోసారి తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం రేకెత్తింది. సాగర్ కుడి కాల్వకు అక్రమ నీటి తరలింపును వెంటనే ఆపాలని కోరుతూ తెలంగాణ ఇరిగేషన్ అధికారులు కృష్ణా రివర్ బోర్డు కు ఫిర్యాదు చేశారు.