ఏపీలో 10వేల కేసులు నమోదు

ఏపీలో 10వేల కేసులు నమోదు
  • మొత్తం 1,20,390కి చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 9గంటల నుంచి బుధవారం ఉదయం 9 గంటల వరకు 10,093 కేసులు నమోదైనట్లు అధికారులు హెల్త్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. చనిపోయిన వారి సంఖ్య 1,213కి చేరింది. ఇప్పటి వరకు 55,406 మంది కరోనా నుంచి కోలుకోగా.. 63,771 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 14 మంది చనిపోయారు. అనంతపూర్‌‌లో 8 మంది, విజయనగరంలో ఏడుగురు, చిత్తూరులో ఆరుగురు, కర్నూలులో ఐదుగురు, నెల్లూరులో ఐదుగురు, కృష్ణ, ప్రకాశంలో నలుగురు, గుంటూరు, కడపలో ముగ్గురు చొప్పున, శ్రీకాకుళం, విశాఖపట్నం, పశ్చిగోదావరి జిల్లాల్లో ముగ్గురు చొప్పున చనిపోయారు. ఇప్పటి వరకు మొత్తం 18,20,009 శ్యాంపిల్స్‌ను టెస్ట్‌ చేసినట్లు అధికారులు ప్రకటించారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు