వైకుంఠ ఏకాదశికి టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు

వైకుంఠ ఏకాదశికి టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు

తిరుపతి : టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లతో వస్తేనే దర్శనానికి అనుమతిస్తామని.. టోకెన్లు లేకుండా తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించబోమని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఆన్ లైన్ లో టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లు 25వేలు విడుదల చేయనున్నట్లు చెప్పారు.  ఆన్ లైన్ లో వైకుంఠ ద్వార దర్శనం, టైం స్లాట్ సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తామని వివరించారు. 

జనవరి 2న తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది. భక్తుల దర్శనాలకు సంబంధించిన అంశాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇవాళ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో ధర్మారెడ్డి మాట్లాడారు. సామాన్య భక్తులకు మరింత సులభంగా, వేగంగా దర్శనం అవకాశం కల్పించేందుకు వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో మార్పులు చేయాల్సి ఉందని  చెప్పారు.  నెలరోజుల పాటు వీఐపీ బ్రేక్ దర్శనం ప్రయోగాత్మకంగా నిర్వహిస్తామన్నారు.

తిరుపతిలో టైంస్లాట్ సర్వ దర్శనం టోకెన్లు ఇస్తామని టీటీడీ ఈవో ధర్మారెడ్డి చెప్పారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా టైం స్లాట్, సర్వదర్శనం టోకెన్లు లేకుండా తిరుమలకు వస్తే దర్శనానికి అనుమతించమని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. జనవరి 2న స్వర్ణ రథం ఊరేగింపు, జనవరి 3న చక్రస్నానం నిర్వహిస్తామని ఈవో వివరించారు.