
న్యూఢిల్లీ: 3 బిలియన్ డాలర్ల (సుమారు రూ.21 వేల కోట్లు) ఒప్పందం చేసుకుని ఇండియా, అమెరికా తమ డిఫెన్స్ కోఆపరేషన్‌ను పెంచుకున్నాయని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అన్నారు. 6 అపాచీ, 24 ఎంహెచ్60 రోమియో హెలికాప్టర్లతో సహా అడ్వాన్స్డ్ అమెరికన్ మిలటరీ ఎక్వీప్‌మెంట్‌ను డీల్ కుదుర్చుకున్నామన్నారు. మంగళవారం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ట్రేడ్ సంబంధాలు, కౌంటర్ టెర్రరిజం, ఎనర్జీ కోఆపరేషన్ అంశాలపై ప్రధానితో చర్చలు జరిపారు. తర్వాత జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ట్రంప్ మాట్లాడారు. టెర్రరిజం నుంచి తమ పౌరులను రక్షించే విషయంలో రెండు దేశాలు నిబద్ధతతో ఉన్నాయన్నారు. టెర్రరిజాన్ని ఎదుర్కొనేందుకు పాకిస్తాన్‌తోనూ కలిసి పని చేస్తున్నామన్నారు.
అపాచీ
- పేరు: బోయింగ్ ఏహెచ్64 అపాచీ..
- ఎన్ని: 6 యూనిట్లు కొంటున్నం
- ఎంత: 400 మిలియన్ డాలర్లు
- ఎట్లుంటది: ఇదొక ట్విన్ టర్బో షాఫ్ట్ అటాక్ హెలికాప్టర్.
- ఎంతమంది వెళ్లొచ్చు: ఇద్దరికి ప్లేస్ ఉంటుంది.
- టాప్ స్పీడ్: గంటకు 365 కిలోమీటర్లు
- బరువు: 5,165 కిలోలు
ప్రత్యేకతలు:
- లక్ష్యాన్ని గురిపెట్టేందుకు చాపర్ ముందు భాగంలో సెన్సార్ ఉంటుంది.
- నైట్ విజన్ సిస్టమ్స్ ఉంటాయి.
- 30 ఎంఎం ఎం230 చైన్ గన్ ఉంటుంది.
- ఆయుధాలు, పరికరాలు, ఇతర సామగ్రి తీసుకెళ్లేందుకు స్టబ్-వింగ్ పైలాన్లపై నాలుగు హార్డ్ పాయింట్లు అమర్చి ఉంటాయి.
- భూమి మీద లక్ష్యాలపైకి భారీ మిషన్‌గన్లతో దాడులు చేస్తుంది. ఉన్న చోటి నుంచే కదలకుండా మిస్సైళ్లు, రాకెట్లను ప్రయోగిస్తుంది. క్షణాల్లో దిశను మార్చుకుని వెళ్తుంది.
రోమియో
- పేరు: సికోర్స్కీ ఎంహెచ్60 సీహాక్
- ఎన్ని: 24
- ఎంత:2.6 బిలియన్ డాలర్లు
- ఎట్లుంటది: ట్విన్ టర్బో షాఫ్ట్ ఇంజిన్
- టాప్ స్పీడ్: గంటకు 267 కిలోమీటర్లు
- బరువు:6,895
- వేగంగా ప్రయాణించడం, శత్రువుపై భీకరమైన దాడులు చేయడంలో ఎక్స్‌పర్ట్.
- రాత్రి పూట కూడా గురి తప్పకుండా దాడి చేస్తుంది. రాడార్ వ్యవస్థ, నైట్ విజన్ ఉంటుంది.
- యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్‌మెరైన్ వార్ఫేర్లో కీలకంగా వ్యవహరిస్తుంది. సెర్చ్అండ్ రెస్క్యూ ఆపరేషన్లలో ఉపయోగపడుతుంది.
- బలగాల తరలింపు, సరుకుల రవాణాకు ఉపయోగపడుతుంది.