పురుగులన్నం పెడ్తున్నారని గురుకులం ముందు ఆందోళన

పురుగులన్నం పెడ్తున్నారని గురుకులం ముందు ఆందోళన
  • పురుగులన్నం పెడ్తున్నారని గురుకులం ముందు ఆందోళన

నల్గొండ అర్బన్, వెలుగు :  నల్గొండ జిల్లా కేంద్రంలోని మునుగోడు రోడ్డులో ఉన్న అప్పాజిపేట బీసీ గురుకుల బాలికల పాఠశాల,  కళాశాలలో స్టూడెంట్లకు పురుగుల అన్నం పెడ్తున్నారు.  మెనూ సైతం పాటించకపోవడంతో ఆదివారం  బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో తల్లిదండ్రులు తరలివచ్చి స్టూడెంట్లను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ.. కేవలం రాజకీయాలకే పరిమితమైన రాష్ట్ర ప్రభుత్వం స్టూడెంట్ల సమస్యలను పట్టించుకోకపోవడం లేదన్నారు. 

ALSO READ :బంగారు నగలకు మెరుగు పెడ్తామని మోసం

గురుకులాల్లో మెనూ అసలే పాటించడం లేదన్నారు.  తుట్టెలు కట్టి, పురుగులున్న  బియ్యంతో అన్నం వండుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమీషన్ల కోసం అరకొర వసతులు ఉన్న బిల్డింగ్స్ ను తీసుకుని స్టూడెంట్ల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. కలెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడం వల్ల గురుకుల పాఠశాలలను ఇష్టం వచ్చినట్లు నడుపుతున్నారని విమర్శించారు. కలెక్టర్  జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ గురుకుల పాఠశాలలను సందర్శించి డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు.