Apple SE : ఎస్ఈ 4 మోడల్పై ఐఫోన్ కీలక నిర్ణయం

Apple SE : ఎస్ఈ 4 మోడల్పై ఐఫోన్ కీలక నిర్ణయం

యాపిల్ ఐఫోన్లు ఎంత ఖరీదైనవో తెలిసిందే. సామాన్య ప్రజలకు కూడా ఆ బ్రాండ్ని దగ్గర చేయడానికి ఐఫోన్ ఎస్ఈ (SE) మోడల్స్ ని తీసుకొచ్చింది. అయితే, ఆ మోడల్ ఫోన్లు ఇకపై ఉండకపోవచ్చని యాపిల్ కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే 3 జనరేషన్ ఎస్ ఈ మోడల్ ఫోన్లను తీసుకొచ్చిన యాపిల్, 2024లో విడుదల కాబోయే 4వ జనరేషన్ మోడల్ ని రద్దు చేసింది.

ఇప్పటివరకు వచ్చిన ఎస్ఈ మోడల్స్ అన్నీ 4జీ టెక్నాలజీతో వచ్చినవే. అయితే ఈ సారి తీసుకురాబోయే 4వ జనరేషన్ ఫోన్లలో 5జీ టెక్నాలజీని తీసుకురావాలని మొదట అనుకుంది. అయితే ఆ ఆలోచనను ఇప్పుడు విరమించుకుంది. బడ్జెట్ ఐఫోన్లని కొనడానికి చాలామంది వెనకడుగు వేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన 12 మినీ, 13 మినీ, 14 మినీ ఫోన్లకు అనుకున్నంత ఆదరణ రాలేదు. దీంతో తర్వాత రాబోయే ఐఫోన్ మోడల్ 15లో 15మినీ ఉండబోదని ప్రకటించింది. అంతేకాకుండా ఎస్ఈ 4వ జనరేషన్ ఫోన్లను కూడా రద్దు చేసుకుంటున్నట్లు యాపిల్ వివరించింది.