IT సంక్షోభం : Dell, Apple, IBM కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు

IT సంక్షోభం : Dell, Apple, IBM కంపెనీల్లో భారీగా ఉద్యోగుల తొలగింపు

టెక్ కంపెనీలు లేఆఫ్స్ పరంపరను కొనసాగిస్తున్నాయి. 2023లో లక్షల్లో ఉద్యోగులను తొలగించిన  టెక్ దిగ్గజ కంపెనీలు 2024 లోనూ అదే విధానాన్ని కొనసాగిస్తున్నాయి.  టెక్ రంగం ఎదుర్కొంటు న్న అనేక సవాళ్లు, కంపెనీల నిర్వహణ భారం తగ్గించుకునేందుకు తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి. 2024లో ప్రారంభ నెల జనవరి, ఫిబ్రవరిలో వేలల్లో ఉద్యోగులకు లేఆఫ్స్ నోటీసులు పంపిన కంపెనీలు.. తాజాగా మార్చి నెలలోనూ అదే స్థాయిలో ఉద్యోగులకు లేఆఫ్స్ మెయిల్స్ పంపించాయి. 

ఎరిక్సన్, డెల్, యాపిల్ వంటి దిగ్గజ టెక్ కంనీలు పలు కారణాలతో ఉద్యోగాల కోతను చూపాయి.5 G  పరికరాలకు డిమాండ్ తగ్గుతున్న క్రమంలో ఎరిక్సన్ 1200 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. మరో టెక్ దిగ్గజం డెల్ కూడా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో తన ఉద్యోగులను  తగ్గించుకుంది. 

ఎరిక్సన్ తొలగింపులు: 5G నెట్ వర్క్ పరికరాల డిమాండ్ తగ్గిపోవడంతో స్వీడన్  లో దాదాపు 1200 మంది స్వీడీష్ టెలికాం డిగ్గజం కాస్ట్ సేవింగ్ ప్లాన్ లో భాగంగా ఈ కోతలు విధించింది. గతేడాది 2023లో కూడా 8శాతం ఉద్యోగులు అనగా 8500 మంది ఉద్యోగులను తొలగించింది. 

డెల్ తొలగింపు:  కంపెనీ నిర్వహణ ఖర్చులు తగ్గించుకునే చర్యల్లో భాగంగా డెల్ తన ఉద్యోగులను తొలగించుకున్నట్లు డెల్ కంపెనీ తెలిపింది. 2023లో మొత్తం లక్షా 26 వేల మంది ఉద్యోగులు ఉండగా.. 2024 ఫిబ్రవరినాటికి లక్షా20వేల చేరింది. అంటే రెండు నెల్లలో 6వేల మంది ఉద్యోగులను తొలగించింది. డెల్ పీసీల కు నెమ్మదిగా డిమాండ్ తగ్గుతున్నసమయంలో కంపెనీ ఉద్యోగులను తొలగించింది. ఫలితంగా 2023 చివరి త్రైమాసికంలో 11 శాతం రాబడి తగ్గింది. 

IBM  లేఆఫ్స్: ఇంటర్నేషనల్ బిజినెస్ మెషీన్స్ కార్ప్ (IBM) కంపెనీ మార్కెటింంగ్, కమ్యూనికేషన్స్ విభాగాల్లో ఉద్యోగులను తొలగిస్తున్న ప్రకటించింది. అయితే ఎంతమందిని తొలగిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. IBM చీఫ్ కమ్యూనికేషన్ ఆఫీసర్ జోనాథన్ ఈ విషయాన్ని ఓ సమావేశంలో తెలియజేశారు.