Apple Air iPad: రూ.9వేల భారీ డిస్కౌంట్తో యాపిల్ ఐప్యాడ్

Apple Air iPad: రూ.9వేల భారీ డిస్కౌంట్తో యాపిల్ ఐప్యాడ్

Apple Air Series 5వ జనరేషన్ ఐప్యాడ్ ఇప్పుడు భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ కామర్స్ ఫ్లాట్ ఫారమ్ ఫ్లిప్ కార్ట్ ఆపిల్ ఎయిర్ ఐప్యాడ్ పై రూ.9వేల తగ్గింపుతో అందిస్తోంది. ఈఐప్యాడ్  ఒరిజినల్ ధర రూ. 59,990. డిస్కౌంట్ తర్వాత ధర రూ. 49,999లకే ఈ ఆపిల్ ఎయిర్ ఐప్యాడ్ లభిస్తోంది. ఆపిల్ లో M1 చిప్, 10.9 అంగుళాల స్క్రీన్ , WiFi  కలిగివున్న Apple Air ipad  మోడల్ కు మాత్రమే ఈ ధర వర్తిస్తుంది. ఈ ఐప్యాడ్ పై బ్యాంకు ఆఫర్లు కూడా ఉండటంతో ధర మరింత తగ్గుతుంది. HSBC బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 10శాతం తగ్గింపు, ICICI బ్యాంక్ డెబిట్ కార్డ్ EMI లావాదేవీలపై రూ. 1250 తగ్గింపు ఇస్తోంది. 

ఈ 5వ తరం ఐప్యాడ్ ఎయిర్ ఐప్యాడ్ ను 2022లో ప్రారంభించారు. ఫీచర్ల విషయానికి వస్తే.. ఐప్యాడ్ ఎయిర్ మోడల్ 10.9 అంగుళాల లిక్విడ్ రెటినీ డిస్ ప్లేతో లభిస్తుంది. ఇది 3.8 మిలియన్ పిక్సెల్ , 500 నిట్స్ బ్రైట్ నెస్, P3 వైడ్ కలర్ గామట్, ట్రూ టోన్, యాంటీ రిప్లెక్టివ్ తో వస్తుంది. స్ర్కీన్ కోటింగ్ , అదనపు భద్రత కోసం, పవర్ బటన్ లో చట్ ID ఆధారిత ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ డివైజ్ eSIM, స్టీరియో స్పికర్లు, WIFI 6 కి కూడా సపోర్ట్ చేస్తుంది. 

వీడియో కాలింగ్ కోసం.. Apple  ముందు భాగంంలో 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, కెమెరాను కలిగి ఉంటుంది. ఈ డివైజ్ సెంటర్ స్టేడజ్ ఫీచర్ కు సపోర్ట్ చేస్తుంది.