బడ్జెట్ మార్కెట్పై కన్నేసిన యాపిల్

బడ్జెట్ మార్కెట్పై కన్నేసిన యాపిల్

యాపిల్ ప్రొడక్ట్స్కున్న క్రేజ్ కు తగ్గట్లుగానే వాటి ధరలు కూడా ఉంటాయి. రేటు ఎక్కువైనా చాలా మంది వాటిని వాడేందుకు ఇష్టపడతారు. కానీ, అంత ఖర్చు పెట్టలేనివారు మాత్రం వెనకడుగు వేస్తారు. ప్రస్తుతం యాపిల్ ప్రొడక్ట్స్ లో అతి తక్కువ ధరలో ఉన్నవి సెకండ్ జనరేషన్ ఎయిర్ పాడ్స్ మాత్రమే. వీటి ధర రూ.15వేలు.  ఈ క్రమంలో కస్టమర్లను మరింతగా ఆకర్షించి మార్కెట్ షేర్ పెంచుకునేందుకు యాపిల్ సిద్ధమైంది. ఇందులో భాగంగా బడ్జెట్ కస్టమర్ల కోసం తక్కువ రేటులో ప్రొడక్ట్స్ తీసుకురావాలని యాపిల్ భావిస్తోంది.

2024 సెకండ్ క్వార్టర్ కల్లా యాపిల్ బడ్జెట్ ప్రొడక్ట్స్  మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తొలుత ఎయిర్ పాడ్స్  లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. వీటి ధర రూ.8000 ఉండొచ్చని అంచనా. వీటితో పాటు ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ పేరుతో మరో వేరియంట్  కూడా తీసుకురాబోతున్నారు. ఈ నిర్ణయం ద్వారా ఆడియో మార్కెట్లో యాపిల్ వాటా పెరిగే అవకాశం ఉంది.