కరోనాతో 69 స్టోర్లను మూసివేసిన ‘ఆపిల్’

కరోనాతో 69 స్టోర్లను మూసివేసిన ‘ఆపిల్’

కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఆపిల్ సంస్థ తమ కంపెనీకి చెందిన 69 స్టోర్లను తాత్కాలికంగా మూసివేసింది. కాలిఫోర్నియాలోని 53 దుకాణాలను మరియు లండన్‌లోని 16 తాత్కాలికంగా మూసివేసినట్లు సంస్థకు చెందిన ప్రతినిధి తెలిపారు. కాలిఫోర్నియా మరియు లండన్ ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన కరోనా ఆంక్షల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ ప్రతినిధి చెప్పారు. ఈ మూసివేత ప్రభావం ఐఫోన్‌లను తయారుచేసే 12 స్టోర్లపై పడుతుందని కంపెనీ తెలిపింది.

‘ప్రస్తుత కరోనా పరిస్థితుల కారణంగా.. మేం ఈ రెండు ప్రాంతాలలోని స్టోర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నాం. పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించి.. తదుపరి చర్యలు తీసుకుంటాం. మేం మా ఉద్యోగులను మరియు కస్టమర్లను కొల్పోకూడదని అనుకుంటున్నాం. వీలైనంత త్వరగా మళ్లీ స్టోర్లను రీఓపెన్ చేస్తాం. స్టోర్లు మూతపడ్డా.. ఇప్పటికే ఆర్డర్ ఇచ్చిన వినియోగదారులు తమ ఆర్డర్లను తీసుకోగలుగుతారు’ అని కంపెనీ ఇమెయిల్ ప్రకటనలో తెలిపింది. కాగా.. స్టోర్లను తిరిగి ఎప్పుడో తెరుస్తారో మాత్రం కంపెనీ తన ప్రకటనలో ప్రస్తావించలేదు.

యునైటెడ్ స్టేట్స్ మరియు యునైటెడ్ కింగ్‌డమ్‌లో కరోనావైరస్ కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పటివరకు 17.4 మిలియన్లకు పైగా ప్రజలు ఇన్‌ఫెక్షన్ బారినపడ్డారు. వీరిలో 3,14,000 మంది మరణించారు.

కరోనా వ్యాప్తి కారణంగా ఇంగ్లాండ్‌లో మరోసారి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు బ్రిటిష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించారు. క్రిస్మస్ సందర్భంగా మరిన్ని జాగ్రత్తలు అవసరమని ఆయన అన్నారు. జాన్సన్ మాట్లాడుతూ.. ‘లండన్ మరియు ఆగ్నేయ ఇంగ్లాండ్‌లు ఇప్పుడు టైర్ 4 స్థాయి లాక్డౌన్లో ఉంచబడతాయి. ఆ ప్రాంతాలలో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దు. అందరూ ఇళ్లలోనే ఉండాలి. అవసరం లేని రిటైల్ షాపులు, ఎంటర్‌టైన్‌మెంట్ మొదలైనవి మూసివేయబడతాయి’ అని ఆయన తెలిపారు.

For More News..

ఢిల్లీ గురుద్వారాను సందర్శించిన ప్రధాని మోడీ

వైద్యుల నిర్లక్ష్యం.. ఆర్టీసీ డ్రైవర్ల రూల్స్.. ఫలితం భార్య శవంతో బస్టాండ్‌లో భర్త

అయోధ్యలో నిర్మించబోయే మసీదు, ఆస్పత్రి నమూనాలివే..