SSCలో 2049 జాబ్స్‌కు దరఖాస్తు గడువు పెంపు

SSCలో 2049 జాబ్స్‌కు దరఖాస్తు గడువు పెంపు

కేంద్రం ప్రభుత్వ వివిధ విభాగాల్లో సెలక్షన్‌ పోస్టులను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీకి ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. దీని ద్వారా 2049 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 26న ప్రారంభం కాగా.. దరఖాస్తు గడువు మార్చి 18తో ముగియాల్సి ఉంది. అయితే ఈ గడువును మార్చి 26 వరకు పొడిగించారు. 

అభ్యర్థులు మార్చి 27 వరకు ఫీజు చెల్లించవచ్చు. దరఖాస్తుల సవరణకు మార్చి 30 నుంచి ఏప్రిల్ 1 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్, తదితర పరీక్షల ఆధారంగా ఉద్యోగ ఎంపికలు చేపడతారు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 6 నుంచి 8 వరకు రాతపరీక్ష నిర్వహించనున్నారు. పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి. స్కిల్ టెస్ట్, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్, డేటాఎంట్రీ టెస్ట్, కంప్యూటర్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.