ఓయూలో ఫ్రీ సివిల్ సర్వీస్ కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఓయూలో ఫ్రీ సివిల్ సర్వీస్ కోచింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్​లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చెందిన సివిల్ సర్వీస్ అకాడమీ- యూపీఎస్సీ సివిల్ సర్వీస్ (ప్రిలిమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌)కు సంబంధించి ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్​ కోరుతోంది. ఉస్మానియా వర్సిటీ పరిధిలో పీజీ, పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ చదువుతున్న విద్యార్థులు డిసెంబర్ 2వ తేదీలోగా అప్లై చేసుకోవాలి.

అర్హత :  ఓయూ పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీ విద్యార్థులు, క్యాంపస్ కాలేజీలతో పాటు సికింద్రాబాద్, సైఫాబాద్ పీజీ కళాశాలలు, నిజాం కళాశాలకు చెందిన పీజీ విద్యార్థులు అర్హులు.

సెలెక్షన్​ ప్రాసెస్​:  డిగ్రీ మార్కులు, పీజీ ఎంట్రన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సాధించిన ర్యాంకు, రూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిజర్వేషన్ తదితరాలను అనుసరించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నాలుగున్నర నెలలు ట్రైనింగ్​ ఇస్తారు.

దరఖాస్తు విధానం : ఓయూ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సూచించిన దరఖాస్తును పూర్తిచేసి, సర్టిఫికేట్​ జిరాక్స్​ను ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ కార్యాలయంలో డిసెంబర్ 2లోగా అందజేయాలి. పూర్తి వివరాలకు 8331041332 ఫోన్​ నంబర్​కు సంప్రదించాలి.