పోలీస్ జాబ్స్.. అప్లికేషన్ల గడువు 2 రోజులే

పోలీస్ జాబ్స్.. అప్లికేషన్ల గడువు 2 రోజులే
  • శుక్రవారంతో ముగియనున్న అప్లికేషన్స్ గడువు
  • మంగళవారం వరకు 7.6 లక్షల అప్లికేషన్స్
  • 4.18 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు
  • ఆగస్ట్  7న ఎస్సై, 21 కానిస్టేబుల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్
  • సెప్టెంబర్   మొదటి వారంలో రిజల్ట్ 
  • రెండేండ్ల వయోపరిమితిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలంటున్న పోలీసులు

మరో రెండు రోజుల్లో పోలీస్  ఉద్యోగాలకు అప్లికేషన్ల గడువు ముగుస్తోంది. దీంతో ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణపై రిక్రూట్ మెంట్ బోర్డ్  ఫోకస్ పెట్టింది. ఆగస్ట్  7న ఎస్సై, 21న కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 2 న ప్రారంభమైన అప్లికేషన్స్ ప్రాసెస్ లో ఇప్పటికే దాదాపు 8 లక్షల అప్లికేషన్లు వచ్చాయి. గడువు దగ్గర పడుతున్నా కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ళ వయో పరిమితి ఇవ్వాలన్న డిమాండ్ పై ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదు. పోలీస్ అభ్యర్ధుల ప్రిలిమినరీ ఎగ్జామ్స్  కోసం పోలీస్ రిక్రూట్ మెంట్  బోర్డ్ ఏర్పాట్లు చేస్తోంది. ఆధునిక టెక్నాలజీతో ప్రిలిమినరీ ఎగ్జామ్  పూర్తి చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఎలాంటి అవినీతి జరక్కుండా పూర్తిగా ఆన్ లైన్ లో అప్లికేషన్స్, ఈవెంట్స్ , ఫైనల్  రిజల్ట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు వచ్చిన దరఖాస్తుల్లో 68 శాతం మంది తెలుగు, 32 శాతం మంది ఇంగ్లీష్  మీడియం సెలెక్ట్  చేసుకున్నారు. హైదరాబాద్ , రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం నుంచి 28 శాతం అప్లికేషన్స్  వచ్చాయి. ములుగు, జయశంకర్ భూపాల్ పల్లి, ఆసిఫాబాద్ , నారాయణపేట, సిరిసిల్ల జిల్లాల నుంచి 1 శాతం మంది అభ్యర్ధులు మాత్రమే అప్లై చేసుకున్నట్లు సమాచారం.

తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు... మొత్తం 16 వేల 614 పోస్టులకు సంబంధించి.. నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే దాదాపు 8లక్షల దాకా దరఖాస్తులు బోర్డుకి అందాయి. శుక్రవారం రాత్రి 10 గంటలకు వరకు అప్లయ్ చేసుకోడానికి టైమ్ ఉంది. మొత్తం 9 లక్షలకు పైగా అప్లికేషన్స్  వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అభ్యర్ధుల సమస్యలపై హెల్ప్ లైన్  కి 11 వేల 972 కాల్స్  వచ్చాయి. వీటిల్లో 11 వేల 449 సమస్యలను అధికారులు పరిష్కంచారు. ఈ నెల 21 నుంచి డేటా సెంట్రలైజ్ చేస్తారు. అప్లికేషన్స్  ఆధారంగా ఎగ్జామ్ సెంటర్స్ , ఇన్విజిలేటర్స్ , బయోమెట్రిక్  టీమ్స్  ఏర్పాటు చేస్తారు. క్వశ్చన్ పేపర్ , OMR  షీట్స్ తో పాటు హాల్  టికెట్స్  ప్రక్రియ పూర్తి చేసేందుకు కనీసం రెండు వారాల టైమ్ పట్టే అవకాశం ఉందన్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆగస్ట్  7న SI ప్రిలిమినరీ, 21 కానిస్టేబుల్  రాత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఎలాంటి అవినీతికి అవకాశం లేకుండా రిక్రూట్ మెంట్ ప్రాసెస్ నడుస్తుందనీ... దళారులను నమ్మి మోస పోవద్దంటున్నారు బోర్డు అధికారులు. అలాంటి వారి సమాచారం ఇస్తే లక్ష రూపాయల బహుమతి ఇస్తామని ప్రకటించారు. అయితే కానిస్టేబుల్ పోస్టులకు మరో రెండేళ్ళ వయో పరిమితి పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా... అమలు చేస్తామని తెలంగాణ పోలీసు రిక్రూట్ మెంట్ బోర్డు చైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం...

ముగ్గురు వ్యాపారవేత్తలకు రాజ్యసభ సీట్లు

ఎస్సీ ఉప కులాలకు చట్ట సభల్లో అవకాశమివ్వాలె