
బెంగళూరులోని సెంట్రల్ సిల్క్ బోర్డ్(సీఎస్‌బీ) 142 స్టెనోగ్రాఫర్, జూనియర్ ఇంజినీర్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి అప్లికేషన్స్ కోరుతోంది.
పోస్టులు: కంప్యూటర్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ ఇంజినీర్, ఫీల్డ్ అసిస్టెంట్, యూడీసీ తదితరాలు.
అర్హత: మెట్రిక్యులేషన్‌తో పాటు పోస్టును అనుసరించి విద్యార్హత ఉండాలి. వయసు 25 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, స్కిల్ టెస్ట్/ ప్రొఫీషియన్సీ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. పరీక్ష మొత్తం 120 మార్కులకు ఉంటుంది.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా జనవరి 16 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.csb.gov.in వెబ్సైట్ సంప్రదించాలి.