ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా ఏఆర్ రెహమాన్

ఇండియన్  బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా ఏఆర్ రెహమాన్

ఆస్కార్ అవార్డు గ్రహీత, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఇండియన్ బ్రేక్ త్రూ ఇనిషియేటివ్ అంబాసిడర్ గా నియమితులయ్యారు. బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఆర్ట్స్ (BAFTA) ఈ అరుదైన గౌరవాన్ని రెహమాన్ కు అందించింది. బాఫ్టా రాయబారిగా ఏఆర్ రెహమాన్ ఇకపై నెట్ ఫ్లిక్స్ తో కలిసి భారత్ లో ఉన్న ప్రతిభావంతులైన ఆర్టిస్టులను గుర్తించాల్సి ఉంటుంది.

బాఫ్టాతో కలిసి పనిచేయడం పట్ల ఎంతో సంతోషంగా ఉందన్నారు రెహమాన్. సినిమాలు, కళలు, క్రీడలు, బుల్లితెర వంటి పలు రంగాల్లోని అద్భుత నైపుణ్యం ఉన్నవారిని గుర్తించడం కోసం ఎంతో ఉత్సాహంగా ఉన్నానని తెలిపారు.

రెహమాన్ కు గతంలో స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీలోని జయహో పాటకు ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు లభించింది.