చెర్రీ మూవీకి రెహమాన్ మ్యూజిక్

చెర్రీ మూవీకి  రెహమాన్ మ్యూజిక్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా(Buchi Babu Sana)  డైరెక్షన్ లో ఓ మూవీ రాబోతున్న విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ కోసం మ్యూజిక్ సెన్సేషన్ ఏఆర్ రెహమాన్ స్వరాలు సమకూరుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. రామ్ చరణ్ సినిమాకు రెహమాన్(AR Rahman)  స్వయంగా వర్క్ చేయబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

'గొప్ప సబ్జెక్ట్ తో వస్తోన్న రామ్ చరణ్ మూవీ కోసం మ్యూజిక్ అందించబోతున్నట్లు రెహమాన్ తెలియజేశారు. దీంతో అఫీషియల్ గా కన్ఫర్మ్ చేసినట్లు అయ్యింది. అందుకు గానూ రెహమాన్ భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.16 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. తన మ్యూజిక్ తో శ్రోతలను కట్టిపడేసే రెహమాన్ కు తన కెరీర్లో ఇదే అత్యధిక రెమ్యునరేషన్ అని తెలుస్తోంది. 

ఉప్పెన" అనే బ్లాక్ బస్టర్ మూవీతో దర్శకుడిగా పరిచయం అయిన బుచ్చిబాబు సానా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించినందుకు ప్రశంసలు అందుకున్నారు. అయినప్పటికీ, RC16 మూవీకు రెహమాన్ ను తీసుకోవడం పట్ల అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.  

ఇక చాలా రోజుల నుంచి పోస్ట్ ఫోన్ అవుతూ వస్తున్న RC16 మూవీలో గేమ్ చేంజర్ షూట్ పూర్తవ్వగానే రామ్ చరణ్ జాయిన్ అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.