2000 ఏళ్ల కిందటి గోడ అవశేషాలు

2000 ఏళ్ల కిందటి గోడ అవశేషాలు

మౌర్యుల రాజధానిగా ఘన కీర్తిని సొంతం చేసుకున్న బిహార్ లోని పాట్నా నగరంలో మరో చారిత్రక అవశేషం వెలుగుచూసింది. పాట్నా రైల్వే స్టేషన్ కు తూర్పు దిశగా 6 కిలోమీటర్ల దూరంలోని కుమ్రహార్ ప్రాంతంలో..2000 ఏళ్ల కిందటివిగా భావిస్తున్న ప్రాచీన గోడలను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) పరిశోధకులు గుర్తించారు. కేంద్ర ప్రభుత్వ ‘మిషన్ అమృత్ సరోవర్’ కార్యక్రమంలో భాగంగా కుమ్రహార్ ప్రాంతంలో ఉన్న ప్రాచీన సరస్సుకు సంబంధించిన నవీకరణ పనులు జరుగుతున్నాయి. ఇందుకోసం తవ్వకాలు జరుపుతుండగా ప్రాచీన గోడల అవశేషాలు బయటపడ్డాయి. వాటిని పరిశీలించిన పురాతత్వ శాస్త్రవేత్తలు.. ఆ గోడల నిర్మాణానికి కుషాణుల కాలం నాటి ఇటుకలను వాడారని గుర్తించారు. ఉత్తర భారత దేశంలోని పలు రాష్ట్రాలతో పాటు అఫ్ఘానిస్థాన్ లోని చాలా ప్రాంతాన్ని కుషాణులు పరిపాలించారని తెలిపారు. ప్రాచీన గోడల అవశేషాలను గుర్తించిన విషయాన్ని ఢిల్లీలోని ఏఎస్ఐ ప్రధాన కార్యాలయానికి తెలియజేశామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

మరిన్ని వార్తలు..

నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం

మధురై ఆలయంలో వసంతోత్సవాలు