ఈజిప్ట్ మమ్మీ నోట్లో బంగారు నాలుక

ఈజిప్ట్ మమ్మీ నోట్లో బంగారు నాలుక

ఈజిప్టు తవ్వకాల్లో మమ్మీలు బయటపడటం మామూలే కానీ..ఇటీవలీ తవ్వకాల్లో బయటపడ్డ మమ్మీలోని నోట్లో బంగారు నాలుక ఉంది. ఈ  ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలెగ్జాండ్రియా వెలుపల ఉన్న టాపోసిరిస్ మాగ్నా ఆలయంలో పురవాస్తు శాఖ అధికారులు తవ్వకాలు జరిపారు. అందులో ఓ మమ్మీ బయటపడింది. దీని నోట్లో బంగారు నాలుక ఉంది. అయితే దీనిపై శాస్త్రవేత్తలు పరిశోధన జరపగా అది రెండు వేల ఏళ్ల నాటిదని గుర్తించారు. ఈజిప్టులో చనిపోయిన తర్వాత సమాధిలో వాళ్లు దేవుడితో మాట్లాడతారని వాళ్ల నమ్మకం. అందుకే వారు ఇలా ఆ వ్యక్తికి బంగారు నాలుకను పెట్టినట్లు అక్కడి అధికారులు భావిస్తున్నారు.

see more news

పుష్ప నుంచి రెండు సీన్లు లీక్..ఎవరి పని?

మేం తెగిస్తే జైళ్ళు చాలవు.. అరెస్టులు కొత్త కాదు

బండి సంజయ్, అర్వింద్ ఆటలో అరటిపండ్లు