ఆఫర్స్ వచ్చినా.. అందుకే నో అన్నా..!

ఆఫర్స్ వచ్చినా.. అందుకే నో అన్నా..!

దాసి, నిరీక్షణ, లేడీస్‌‌‌‌‌‌‌‌ టైలర్, భారత్‌‌‌‌‌‌‌‌ బంద్ లాంటి చిత్రాలతో ఒకప్పుడు అందరినీ ఆకట్టుకున్న అర్చన.. లాంగ్‌‌‌‌‌‌‌‌ గ్యాప్‌‌‌‌‌‌‌‌ తర్వాత తెలుగులో నటించారు. ఆకాష్‌‌‌‌‌‌‌‌ పూరి హీరోగా జీవన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తీసిన ‘చోర్ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ చిత్రంలో కీలక పాత్ర పోషించిన అర్చన.. ఆ సినిమా గురించి ఇలా ముచ్చటించారు. 

‘‘జీవన్ తీసిన ‘జార్జి రెడ్డి’ నాకు చాలా నచ్చింది. ‘చోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బజార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’లో పాత్ర కోసం నన్ను సంప్రదించినప్పుడు ఒకటే అడిగాను.. ఇందులో నేను ఎవరికి ఏమవుతాను అని. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత ఆడవాళ్లకి సినిమాల్లో సరైన రోల్స్‌‌‌‌‌‌‌‌ లేకుండా పోయాయి. అక్క, వదిన, అమ్మ, అత్త పాత్రలే వస్తున్నాయి. అవి కూడా రొటీన్‌‌‌‌‌‌‌‌ రోల్స్. అందుకే ప్రతి మూడు నెలలకీ తెలుగు నుంచి నాకు రెండు ఆఫర్స్‌‌‌‌‌‌‌‌ వస్తున్నా వేటికీ ఓకే చెప్పలేదు. జీవన్‌‌‌‌‌‌‌‌ మాత్రం ఓ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ని రాశాడు. అందుకే ‘మీరు ఎవరికీ ఏమీ కారు’ అంటూ నా క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గురించి చెప్పగానే, ‘షూటింగ్ ఎప్పుడో చెప్పు’ అనేశాను. అంతలా నచ్చింది. అమితాబ్‌‌‌‌‌‌‌‌ బచ్చన్‌‌‌‌‌‌‌‌కి ఫ్యాన్‌‌‌‌‌‌‌‌గా, లవర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా కనిపిస్తా. ఆయన కోసం ప్రాణం ఇచ్చేంత అభిమానం. ఆయనపై ప్రేమతో పెళ్లి కూడా చేసుకోకుండా, కలలోకి అమితాబ్ వస్తాడని మేకప్ వేసుకుని మరీ పడుకునే క్యారెక్టర్ నాది. మొదట నలభయ్యేళ్ల పాత్ర. ఆ తర్వాత పదేళ్ల వయసు తగ్గిద్దామన్నాడు జీవన్‌‌‌‌‌‌‌‌. మేకప్‌‌‌‌‌‌‌‌తో మేనేజ్ చేశాం. అయితే ఓ సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రైజింగ్ సీన్‌‌‌‌‌‌‌‌ ఉంది. రెండున్నర నిమిషాల ఆ సీన్‌‌‌‌‌‌‌‌లో ‘నిరీక్షణ’ టైమ్‌‌‌‌‌‌‌‌లో కనిపించినంత యంగ్‌‌‌‌‌‌‌‌గా కనిపించాలన్నాడు. అలా ఎలా తగ్గించగలమని మొదట అనుకున్నా. ఎలాగోలా ప్రయత్నించా. ప్రేక్షకులు ఎలా రిసీవ్‌‌‌‌‌‌‌‌ చేసుకుంటారో చూడాలి. తెలుగులో గ్యాప్‌‌‌‌‌‌‌‌ వచ్చింది కానీ ఇతర భాషల్లో చేస్తూనే ఉన్నాను. తెలుగులోనూ మరో సినిమా ఉంది. భారీ స్టార్ కాస్ట్‌‌‌‌‌‌‌‌తో రూపొందుతున్న ఓ వెబ్‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌లోనూ నటించబోతున్నాను.’’