Sai Pallavi: సోషల్ మీడియాలో సాయి పల్లవి బికినీ ఫొటోలు వైరల్.. ఇందులో నిజమెంత? క్లారిటీ ఇదే!

Sai Pallavi: సోషల్ మీడియాలో సాయి పల్లవి బికినీ ఫొటోలు వైరల్.. ఇందులో నిజమెంత? క్లారిటీ ఇదే!

సాయి పల్లవి (Sai Pallavi).. ఈ పేరుకు టాలీవుడ్లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రస్తుతం టాలీవుడ్లో హీరోయిన్ గానే కాకుండా సహజ నటిగా రాణిస్తూ ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది. కొంతమంది స్టార్ హీరోయిన్స్.. గ్లామర్తో ఫ్యాన్స్ని గెలుచుకుంటే, మరికొందరు తన నేచురల్ యాక్టింగ్తో ఆకట్టుకుంటారు. ఈ రెండో వర్గానికి చెందిన నటి సహజ నటి సాయి పల్లవి.

గ్లామర్ని పూర్తిగా పక్కన పెట్టేసి, అదిరిపోయే స్టెప్పులతో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేసే డ్యాన్సింగ్ క్వీన్ ఆమె. తన ఫస్ట్ మూవీ “ప్రేమమ్” నుండి ఇపుడు రాబోయే “రామాయణ” వరకు పద్దతైనా పాత్రలతో మెప్పిస్తుంది. అలా తనకుంటూ ఓ సొంత ఇమేజ్ను క్రియేట్ చేసుకుని.. సక్సెస్కు కేరాఫ్ అడ్రస్గా దూసుకెళ్తోంది సాయి పల్లవి.

ఈ క్రమంలో సాయి పల్లవి ఫ్యాన్స్ని హర్ట్ చేసే ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గ్లామర్‌పై ఆధారపడని సాయి పల్లవి.. బికినీ వేసిందంటూ కొన్ని ఫొటోలు వైరల్ అవుతూ హాట్ టాపిక్గా మారాయి. అసలు ఈ ఫొటోల్లో ఉన్నది నిజంగా సాయి పల్లవేనా? ఎవరైనా AIని (ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్) ఉపయోగించి వైరల్ చేశారా.. అనేది చూద్దాం.

ALSO READ : తల్లి సంకల్పం గొప్పదనే సందేశంతో ‘మా వందే’

గ్లామర్ పాత్రలకు, ఎక్స్‌పోజింగ్‌కు ఎప్పుడూ దూరంగా ఉండే సాయి పల్లవి బికినీ ఫొటోలు వైరల్ అవుతున్నాయి. లేటెస్ట్గా సాయి పల్లవి చెల్లెలు పూజా కన్నన్ తన ఇన్స్టాగ్రామ్లో బీచ్ వెకేషన్కు వెళ్లిన ఫొటోలను షేర్ చేసింది. ఇందులో సాయి పల్లవి స్విమ్ సూట్లో తొలిసారి బయట కనిపించింది. ఈ క్రమంలోనే సాయి పల్లవి స్విమ్ సూట్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

అయితే, ఇదే అదనుగా చేసుకుని, ప్రత్యేకించి ఆమె కొన్ని మార్ఫింగ్ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో చక్కర్లు అయ్యేలా చేశారు కొంతమంది. పూజా పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలను కొందరు AI ద్వారా మార్ఫింగ్ చేసి.. సాయి పల్లవి బికినీ ధరించినట్టుగా ఫొటోలను క్రియేట్ చేశారు. ఇందులో పూజ బీచ్ వద్ద కూర్చుని నవ్వుతున్నట్లుగా ఉన్నాయి. పూజతో సెల్ఫీలకు పోజులిచ్చేటప్పుడు సాయి పల్లవి కూడా చిరునవ్వు నవ్వింది. ఇలా ఉన్న ఫోటోలకు బికినీ అంటూ వైరల్ చేస్తున్నారు. ఇపుడు ఈ ఫేక్ ఫొటోలకు నెటిజన్లు భిన్న రకాలుగా ట్వీట్స్ పెడుతున్నారు. ఈ క్రమంలో సాయి పల్లవికి మద్దతుగా ఫ్యాన్స్ ట్వీట్స్ పెడుతున్నారు. అందులో ఓ అభిమాని “ఆమె ఏం వేసుకోవాలనుకున్నా సాయి పల్లవి ఇష్టం. సముద్రంలో నీటి అడుగున ఏమి ధరించాలని మీరు ఆశిస్తున్నారు ?? చీర ??”అని కౌంటర్ ఇచ్చాడు. 

ఏదేమైనప్పటికీ.. ఇవి నిజమైన ఫోటోలు కావనే క్లారిటీ సాయి పల్లవి అభిమానుల్లో వచ్చేసింది. పూజా కన్నన్ షేర్ చేసిన కొన్ని ఒరిజినల్ ఫోటోలను త్వరితంగా పరిశీలిస్తే వైరల్ అయినవి ఫేక్ ఫోటోలని స్పష్టమవుతుంది. దురదృష్టవశాత్తు, వాస్తవాలు తెలియకుండానే, చాలా మంది వాటిని నిజమైనవిగా నమ్మి, సాయి పల్లవిని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే, బికినీ ఫొటోలపై సాయి పల్లవి స్పందించి క్లారిటీ ఇస్తేనే ఇది ఆగిపోయే అవకాశం ఉంది. చూడాలి మరి ఎప్పుడు.. ఎలా స్పందిస్తుందో!

ఇదిలా ఉండగా.. సాయి పల్లవి గతేడాది కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ హీరోగా నటించిన "అమరన్" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో హీరో నాగ చైతన్య నటించిన "తండేల్" సినిమాతో మంచి క్లాసికల్ హిట్ అందుకుంది. ప్రస్తుతం హిందీలో రామాయణ, ఏక్ దిన్ తదితర సినిమాల్లో నటిస్తోంది. ఈ సినిమాలో సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది.