
సైమా అవార్డ్స్ 2025 వేడుకలు దుబాయ్‌లో జరిగాయి. పుష్ప 2కి అవార్డుల వర్షం కురిసింది. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ హీరోయిన్‌గా రష్మిక, ఉత్తమ దర్శకుడిగా సుకుమార్ అవార్డులు అందుకున్నారు. అయితే, ఈ వేడుకలో రష్మిక మందన్న కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఈ సందర్భంగా సైమా ఈవెంట్తో మాకో క్లారిటీ వచ్చిందంటూ రష్మిక, విజయ్ను ట్యాగ్ చేస్తూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే..
గత మూడేళ్ళుగా విజయ్-రష్మిక సీక్రెట్ డేటింగ్లో ఉన్నట్లు ఇండస్ట్రీలో రూమర్స్ ఊపందుకున్నాయి. ఈ జంట బయటకనిపించిన ప్రతిసారి నెటిజన్లు సైతం ఏదొక విషయంపై మాట్లాడుకుంటునే వస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి వీరి రిలేషన్ షిప్ రూమర్లకు మరింత బలం చేకూరింది.
సైమా అవార్డుల కోసం దుబాయ్ వెళ్లిన రష్మిక చేతికి రింగ్ లాంటిది కనిపించడమే ఇందుకు కారణమైంది. ఈ క్రమంలో విజయ్తో రష్మికకు ఎంగేజ్మెంట్ జరిగిందని ఫిక్స్ అయిపోయారు నెటిజన్లు. అయితే, అంతకంటే ముందే.. రష్మిక ముంబై నుండి దుబాయ్ చేరుకున్నప్పుడు, అక్కడ తన ఫ్యాన్స్కు చేయి ఊపుతుండగా.. ఆమె మూడో వేలికి ఉంగరం కనిపించింది.
#NEXASIIMA సెలబ్రేషన్స్ కోసం దుబాయ్‌లో ల్యాండ్ అయిన #RashmikaMandanna pic.twitter.com/oyK8orH70b
— Ramesh Pammy (@rameshpammy) September 5, 2025
అలాగే, సైమా ఈవెంట్లో రెడ్ కార్పెట్‌లో రష్మిక మళ్ళీ కనిపించినప్పుడు, ఆమె చీర కట్టుకుని ఉంగరాన్ని చిటికెన వేలికి మార్చింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక చెప్పేదేముంది. ఈ యవ్వారం అంతా గమనించిన నెటిజన్లు.. ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుకుంటూ వస్తున్నారు.
“ఇప్పుడు ఆమె రష్మిక దేవరకొండ అవుతుంది” అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. మరొక నెటిజన్ కామెంట్ చేస్తూ.. “రష్మిక దేవరకొండ?” అని మరొకరు ప్రశ్నించారు. ఇంకొకరైతే.. “ఇద్దరికీ అభినందనలు” అని రాశాసుకొచ్చాడు. అలాగే, ఇంకో నెటిజన్ చెబుతూ.. “ఆ ఉంగరం నిశ్చితార్థ ఉంగరంలా కనిపించడం లేదు” అని అన్నారు. త్వరలోనే వీరిద్దరి పెళ్లిని చూడబోతున్నాం అంటూ కూడా పోస్టులు పెడుతున్నారు. ఏదేమైనా రష్మిక సైమా ఈవెంట్ రూమర్స్కి అడ్డగా నిలిచింది. మరి నెటిజన్లు ఉహించుకునేలా మిసెస్ లైగర్ అవుతుందా? లేదా అనేది క్లారిటీ తెలియాల్సి ఉంది.
Our very own Srivalli, Rashmika Mandanna, with her well-deserved award and a little bit of magic! ✨
— TFI 🐉 (@_Pandu__x) September 6, 2025
#NEXASIIMA #SIIMAinDubai #SIIMA2025 pic.twitter.com/o2pouzjPS7
గతంలో విజయ్ రష్మిక.. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలసి నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరిమధ్య ప్రేమ చిగురించిందని అప్పటి నుంచి పర్సనల్ లైఫ్లో చాలా క్లోజ్గా ఉంటున్నారని, అంతేగాకుండా ఇరువురి ఇళ్ళలో జరిగే ఫంక్షన్స్కి కుటుంబ సభ్యులు కూడా హాజరవుతున్నట్లు పలు వార్తలు సైతం వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం రష్మిక మందన పుష్ప 2, ఛావా, కుబేర సినిమాల సక్సెస్ను ఎంజాయ్ చేస్తోంది. హిందీ, తమిళ్, తెలుగు తదితర భాషలలో వరుస ఆఫర్లు దక్కించుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం రష్మిక చేతిలో 'ది గర్ల్‌ఫ్రెండ్', 'రెయిన్‌బో' మైసా, థామా వంటి సినిమాలతో పాటు 'పుష్ప 3' మూవీస్ ఉన్నాయి
విజయ్ దేవరకొండ విషయానికొస్తే.. శ్యామ్ సింగరాయ్ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరో సినిమా తెరకెక్కుతోంది. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో విజయ్ యోధుడిగా కనిపిస్తాడని టాక్. ఇందులో విజయ్కి జోడీగా రష్మిక నటిస్తుంది. ఆ తర్వాత రవికిరణ్ కోలాతో ఓ సినిమా చేస్తున్నాడు.