మీరూ క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

మీరూ క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా..? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే..

Crypto Journey: మారుతున్న ప్రపంచంతో పాటే పెట్టుబడి అలవాట్లు, అవసరాలు కూడా మారిపోతున్నాయి. కొన్ని దశాబ్ధాల కిందట ప్రజలు ప్రభుత్వం బ్యాంకుల్లో డిపాజిట్లు, పోస్టల్ డిపాజిట్లు, ఇన్సూరెన్స్ పాలసీలను తమ పెట్టుబడి మార్గాలుగా ఎంచుకునేవారు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ దాని స్థానాన్ని ఆక్రమించింది. అయితే ప్రస్తుతం ఈక్విటీలు, మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, డిజిటల్ గోల్డ్ తర్వాత క్రిప్టోలు పెట్టుబడి సాధనంగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును తెచ్చుకుంటోంది.

ప్రతి దశాబ్ధంలోనూ ప్రజల లాగే పెట్టుబడి సాధనాలు కూడా మారిపోతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి కొత్త ప్రత్యామ్నాయాలుగా ఉద్భవిస్తుంటాయి. ప్రస్తుతం క్రిప్టో పెట్టుబడులు ఆ కోవకు చెందినవే. దీనిని చాలా మంది ఇన్వెస్టర్లు తమ సంపదను పెంచుకోవటానికి, స్టోర్ చేసుకునేందుకు ఒక మార్గంగా భావిస్తున్నారు. అయితే వీటితో ఎలా జాగ్రత్తగా ముందుకెళ్లాలనే విషయాలు తప్పక ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సి ఉంటుంది.

ముందుగా మీరు క్రిప్టోల్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత ప్రభుత్వ సంస్థ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ అనుమతి పొందిన ఎక్స్ఛేంజీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకోవాలి. వీటిని ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది కాబట్టి వీటిలో భద్రత, లిక్విడిటీ, కస్టమర్ సపోర్ట్ వంటివి నిరంతరం అందుబాటులో ఉంటాయి. వీటిలో మరీ ముఖ్యమైన విషయం మీ ఫండ్స్ జాగ్రత్తగా మీ ఖాతాల నుంచి ఎక్స్ఛేంజీకి, ఎక్స్ఛేంజీ నుంచి మీకు రావటం.

క్రిప్టోల్లో ట్రేడింగ్ సమయంలో బ్యాంక్ లేదా యూపీఐ చెల్లింపులను మెుబైల్ డేటా లేదా సొంత సెక్యూర్డ్ వైఫై, ల్యాన్ ద్వారా నిర్వహించటం మంచిది. అలాగే ఎప్పటికప్పుడు కేవైసీ ప్రక్రియను అప్ డేట్ గా ఉంచటం, సరైన క్రిప్టోలను ఎంపిక చేసుకోవటం కూడా అవసరం. ఇందుకోసం మార్కెట్లో బాగా ప్రాచుర్యం పొందిన బిట్ కాయిన్, ఇథరమ్ వంటి నచ్చిన వాటిని కొంత రీసెర్చ్ తర్వాత ఎంపిక చేసుకోవటం మంచిది. 

కొత్తగా మార్కెట్లోకి వచ్చిన వ్యక్తులు సరైన క్రిప్టోలను ఎంపిక చేసుకోవటం చాలా ముఖ్యం. దీని తర్వాత వాటి సేఫ్టీని జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే మీ ఖాతాలకు సంబంధించిన ప్రైమరీ కీ వివరాలను ఇతరులకు అస్సలు పంచుకోవద్దు. ఇది సైబర్ దాడుల నుంచి మిమ్మల్ని కాపాడుతుందని సైబర్ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో అసలు క్రిప్టోలు ఎలా పనిచేస్తాయి, వాటిలో ఉండే రిస్క్ వంటి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుని ముందుకు సాగటం మంచిది.