
లాస్ వెగాస్: తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఎరిగైసి అర్జున్ ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్ స్లామ్ టోర్నీలో సెమీ ఫైనల్‌తోనే సరిపెట్టుకున్నాడు. శనివారం జరిగిన సెమీస్‌లో అర్జున్ 0–2తో లెవోన్ అరోనియన్ (అమెరికా) చేతిలో ఓడాడు. ఈ టోర్నీలో సెమీస్ చేరిన తొలి ఇండియన్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించిన తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఫామ్‌ను కొనసాగించడంలో విఫలమయ్యాడు. తొలి గేమ్‌లో వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.
అరోనియన్ కూడా క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్నా.. దాన్ని అవకాశంగా మల్చుకోవడంలో అర్జున్ ఫెయిలయ్యాడు. ఫలితంగా రెండు గేమ్‌ల్లోనూ ఓటమిపాలయ్యాడు. ఇతర సెమీస్‌లో కరువాన 1.5–2.5తో హన్స్ మోకీ (అమెరికా) చేతిలో ఓడగా, వెస్లీ సో (అమెరికా) 3–1తో నొడిర్బెక్ అబ్దుసత్తారోవ్ (ఉజ్బెకిస్తాన్)పై, నకమురా (అమెరిక) 2–0తో లీనియర్ డొమింగ్వేజ్‌పై నెగ్గారు.