షెన్‌‌‌‌జెన్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ ఆరో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ డ్రా

షెన్‌‌‌‌జెన్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌లో అర్జున్‌‌‌‌ ఆరో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ డ్రా

న్యూఢిల్లీ: తెలంగాణ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ అర్జున్‌‌‌‌ ఎరిగైసి.. షెన్‌‌‌‌జెన్‌‌‌‌ మాస్టర్స్‌‌‌‌లో మరో గేమ్‌‌‌‌ డ్రా చేసుకున్నాడు. బుధవారం అర్టెమివ్‌‌‌‌ వ్లాడిస్లావ్‌‌‌‌ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ 30 ఎత్తుల వద్ద డ్రా చేసుకున్నాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్‌‌‌‌ కీలక టైమ్‌‌‌‌లో డిఫెన్స్‌‌‌‌లో పట్టు కోల్పోయాడు. దీంతో ప్రత్యర్థికి పుంజుకునే చాన్స్‌‌‌‌ ఇచ్చాడు. 

చివరకు వ్యూహాలు మార్చి డ్రాతో బయటపడ్డాడు. ఈ రౌండ్‌‌‌‌ తర్వాత అర్జున్‌‌‌‌ 4 పాయింట్లతో రెండో ప్లేస్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. మరోవైపు ప్రేగ్ మాస్టర్స్‌‌‌‌ చెస్‌‌‌‌ టోర్నీలో ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. డి. గుకేశ్‌‌‌‌ మధ్య జరిగిన ఏడో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌ డ్రాగా ముగిసింది. ఈ రౌండ్‌‌‌‌ తర్వాత ప్రజ్ఞానంద 4, గుకేశ్‌‌‌‌ 3 పాయింట్లతో ఉన్నారు.