ఆర్మూర్, వెలుగు : విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు. తెలంగాణ బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆర్మూర్ లో మూడు రోజుల పాటు జరిగిన 70వ రాష్ట్రస్థాయి జూనియర్ బాయ్స్ అండ్ గర్ల్స్ బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఆదివారం ముగిసింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే హాజరై విజేతలకు బహుమతులు అందజేసి మాట్లాడారు. క్రీడలకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలన్నారు. ఈఆర్ ఫౌండేషన్ చైర్మన్ ఈరవత్రి రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో క్రీడలు ఒక భాగమేనన్నారు. క్రీడల్లో రాణిస్తే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందే అవకాశం ఉందన్నారు.
టోర్నీలో బాలుర విభాగంలో కరీంనగర్ జిల్లా జట్టుపై ఆదిలాబాద్ జిల్లా జట్టు విజయం సాధించింది. తృతీయ స్థానంలో రంగారెడ్డి, ఫోర్త్ ప్లేస్ లో నల్గొండ జిల్లా జట్టు నిలిచింది. బాలికల విభాగంలో మెదక్ జిల్లా జట్టు ఖమ్మం జిల్లా జట్టుపై విజయం సాధించింది. తృతీయ స్థానంలో వరంగల్, ఫోర్త్ ప్లేస్ లో నిజామాబాద్ జట్టు నిలిచింది. కార్యక్రమంలో జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ టి.విద్యాసాగర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బోనగిరి శ్యామ్, వివిధ జిల్లాల ప్రతినిధులు దుర్గయ్య, రాజయ్య, వీరభద్రరావు, కమల్, రమణ, బయన్న, భాస్కర్ గౌడ్, రాజ్ కుమార్, కాశిరెడ్డి సునీత, నాగేశ్, గట్టడి రాజేశ్, పెగాడ నరేందర్ సదమస్తు రమణ, సురేశ్, సంతోష్ ఠాకూర్, భాగ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
