ఆర్మూర్, వెలుగు : ద్విచక్రవాహనదారులు తప్పకుండా హెల్మెట్ వాడాలని, హెల్మెట్ ధరించే వాహనాలు నడిపించాలని ఆర్మూర్ ఎంవీఐ ఈ. రాహుల్ కుమార్ అన్నారు. రోడ్డు భద్రతా మాసోత్సవంలో భాగంగా సోమవారం ఆర్మూర్టౌన్లో ద్విచక్రవాహనదారులకు హెల్మెట్ పెట్టించి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంవీఐ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. హెల్మెట్ వాడకం ద్వారా ప్రమాదాల నుంచి బయటపడవచ్చని చెప్పారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై రఘుపతి, ఏఎంవీఐ రోహిత్ రెడ్డి, రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు.
