
జమ్మూకశ్మీర్ లో ఎదురుకాల్పులు జరిగాయి. రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదులు- సైనికులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. వీరిలో జూనియర్ కమిషన్డ్ అధికారి సహా నలుగురు జవాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. రాజౌరీ సెక్టార్ లో ఉగ్రవాదుల ఏరివేతకు సైనికులు వెళ్లిన సమయంలో ఎదురుకాల్పుల్లో జవాన్లు చనిపోయినట్లు చెప్పారు అధికారులు.