
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో గురువారం వీధికుక్కలు రెచ్చిపోయాయి. పట్టణంలోని లెనిన్ నగర్లో మహిళలు, వృద్ధులు, పిల్లలపై దాడి చేయడంతో 11మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సీపీఐ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వై. శ్రీనివాస్‌రెడ్డి, కౌన్సిలర్ సత్యనారాయణ చారి పరామర్శించారు.