కామేపల్లిలో వైభవంగా శ్రీగురు హరిహర మహాక్షేత్రం శంకుస్థాపన

కామేపల్లిలో వైభవంగా శ్రీగురు హరిహర మహాక్షేత్రం శంకుస్థాపన

కామేపల్లి, వెలుగు  :  కామేపల్లిలో గురువారం శ్రీగురు హరిహర మహాక్షేత్రం (శివాలయం) శంకుస్థాపన వైభవంగా జరిగింది. కాళీ వనాశ్రమ పీఠాధిపతులు చంద్ర కాళీ ప్రసాద్ మాతాజీ నేతృత్వంలో వేద పండితులు బలగం భార్గవ శర్మ బృందం వేదమంత్రాల నడుమ, భక్తుల ఓంకార నామంతో ఆలయ కమిటీ అధ్యక్షుడు గొట్టుపర్తి శివాజీ దంపతులు శంకుస్థాపన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునుంచి ఆలయ ప్రాంగణంలో మండపారాధన, గణపతి పూజ, వాస్తు పూజ, హోమం, ప్రత్యేక పూజలు చేశారు. 

సుమారు 160 సంవత్సరాల కింద నిర్మించిన శివాలయం శిథిలావస్థకు చేరడంతో దానిని జీర్ణోదారణ జరిపి ఆ స్థానంలో శ్రీ గురు హరి హర క్షేత్ర నామకరణంతో నూతన దేవాలయ నిర్మాణానికి అంకురార్పణ జరిగింది. ఈ కార్యక్రమంలో వాస్తు సిద్ధాంతి నాగఫణి శర్మ, అర్చకులు సాయి, రామకృష్ణ, నరసింహ శర్మ, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.