ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్​కు1,500 మందితో బందోబస్తు

ఇండియా, ఇంగ్లండ్ మ్యాచ్​కు1,500 మందితో బందోబస్తు
  • వివరాలు వెల్లడించిన  రాచకొండ సీపీ సుధీర్ బాబు

సికింద్రాబాద్, వెలుగు: ఉప్పల్ స్టేడియంలో ఇయ్యాల్టి నుంచి జరగనున్న ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్​కు 1,500 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ సుధీర్ బాబు తెలిపారు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. షీ టీమ్స్ ​మఫ్టీలో ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయన్నారు.

స్టేడియం చుట్టూ 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. పోలీస్ అధికారులపైనా నిఘా ఉంచుతామని చెప్పారు. ఉదయం 6.30 నుంచి ప్రేక్షకులను స్టేడియంలోకి అనుమతిస్తామని, మ్యాచ్ మద్యలో ఎవరినీ స్టేడియంలోకి అనుమతించమన్నారు. స్టేడియం చుట్టుపక్కల ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు. ముందుగా కేటాయించిన ప్రాంతంలోనే వెహికల్స్ పార్కింగ్ చేయాలన్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, లాప్​ట్యాప్​లు,హెల్మెట్, పవర్ బ్యాంక్​లు, ఫుడ్ ఐటమ్స్ ను స్టేడియంలోకి అనుమతిమంచని సీపీ సుధీర్ బాబు తేల్చి చెప్పారు. ఎవరైనా బ్లాక్​లో మ్యాచ్ టికెట్లను అమ్మితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు.