జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి నుమాయిష్ 

జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి నుమాయిష్ 

జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరగనున్న 82వ ఆలిండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పారిశ్రామిక ఉత్పత్తుల ప్రదర్శన  నుమాయిస్ ను రాష్ట్ర హోంమంత్రి మొహమ్మద్ అలీ ప్రారంభించనున్నారు. ఈసారి 2,400 స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో బ్యాంక్స్,  ఫారెస్ట్ , ఖాదీ, పోలీస్, డ్వాక్రా, GHMC ల స్టాల్ల్స్ తో పాటు  విదేశీ సంస్థలకు చెందిన స్టాళ్లు  ఉన్నాయి. గతంలో 30 రూపాయులు ఉన్న టికెట్ ధరను ఇప్పుడు 40కి పెంచారు. ఎగ్జిబిషన్ కు వచ్చే వారి వాహనాలకు ఉచిత పార్కింగ్ సదుపాయం కల్పిస్తున్నారు. 

నుమాయిష్  ఏర్పాట్లపై సమీక్ష చేశారు అధికారులు. సందర్శకుల భద్రత కోసం సీసీటీవీ లు, మెటల్ ప్రైమ్ డిటెక్టర్స్, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది ఎక్సిబిషన్ సొసైటీ.  150 మంది వాలంటీర్లు నియమించింది. ఆరోగ్య పరీక్షల సౌకర్యంతో పాటు  అంబులెన్సు ను, ఫ్రీ WIFI ను  అందుబాటులో ఉంచింది. 2019లో  నుమాయిష్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. వందలాది స్టాళ్లు కాలిబూడిదయ్యాయి. ఆ అనుభవాలతో ఈసారి ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు నిర్వహకులు. ప్రతిస్టాల్ లో ఫైర్ ఎక్స్ టింగ్విషర్ తప్పనిసరి ఏర్పాటు చేయాలని  సొసైటీ తెలిపింది. రెండు ఫైరింజన్లను అందుబాటులో ఉంచనున్నారు. రెండున్నర లక్షల  కెపాసిటీ ఉన్న అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్ ను నిర్మించారు నిర్వహకులు.