కరీంనగర్ జిల్లాలో నవోదయ ఎంట్రన్స్‌‌ ఎగ్జామ్‌‌కు ఏర్పాట్లు పూర్తి : పి.మంగతాయారు

కరీంనగర్ జిల్లాలో నవోదయ ఎంట్రన్స్‌‌  ఎగ్జామ్‌‌కు ఏర్పాట్లు పూర్తి : పి.మంగతాయారు

చొప్పదండి, వెలుగు : జవహర్​ నవోదయ ప్రవేశపరీక్ష అప్లికేషన్‌‌లో కులం, అర్బన్, రూరల్, పుట్టిన తేదీ, జెండర్ నమోదులో తప్పులు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 16లోపు చొప్పదండిలోని జవహర్ నవోదయ విద్యాలయ అధికారులను సంప్రదించి సవరించుకోవాలని ప్రిన్సిపాల్ పి.మంగతాయారు సూచించారు. మంగళవారం విద్యాలయంలో ఏర్పాటు చేసిన మీటింగ్‌‌లో ఆమె మాట్లాడుతూ 2024–25 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా ఈ నెల 20న ఉదయం 11:30 నుంచి 1: 30 గంటల వరకు ఎంట్రన్స్‌‌ ఎగ్జామ్​నిర్వహించనున్నట్లు చెప్పారు.

6వ తరగతిలో 80 సీట్లు ఉండగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 7105 మంది విద్యార్థులు పోటీ పడుతున్నారని, ఇందుకు 36 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు ఆన్‌‌లైన్‌‌లో హాల్​టికెట్​డౌన్‌‌లోడ్​చేసుకోవాలని, ఏవైనా ఇబ్బందులు ఎదురైతే 9490395216, 9966759402, 9030426686 హెల్ప్ లైన్‌‌ నంబర్లలో  సంప్రదించాలన్నారు.